రష్మిక క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్!

Published : Sep 29, 2018, 11:36 AM IST
రష్మిక క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్!

సారాంశం

'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ఆ తరువాత 'గీత గోవిందం' సినిమాతో తన స్థాయిని పెంచుకుంది. రీసెంట్ గా విడుదలైన 'దేవదాస్' సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. 'దేవదాస్' కథ మొత్తం ఇద్దరు హీరోల చుట్టూనే తిరుగుతుంటుంది.

'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ఆ తరువాత 'గీత గోవిందం' సినిమాతో తన స్థాయిని పెంచుకుంది. రీసెంట్ గా విడుదలైన 'దేవదాస్' సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. 

'దేవదాస్' కథ మొత్తం ఇద్దరు హీరోల చుట్టూనే తిరుగుతుంటుంది. దీంతో సినిమాలో హీరోయిన్లుగా నటించిన రష్మిక, ఆకాంక్ష సింగ్ లకు స్క్రీన్ స్పేస్ తక్కువ లభించింది. ముఖ్యంగా రష్మిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.

సినిమాలో రష్మిక క్యారెక్టర్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోకుండా తమ అందాల తారకి చిన్న రోల్ ఇచ్చి సరిపెట్టారని బాధ పడుతున్నారు రష్మిక ఫ్యాన్స్. నాని-రష్మికల లవ్ ట్రాక్ కూడా పెద్దగా లేదని.. ప్రేమ సన్నివేసాలపై ఇంకా దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని దర్శకుడికి సలహాలు ఇస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో 'దేవదాస్' సినిమాలో రష్మిక క్యారెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా.. 'దేవదాస్' రూపంలో రష్మికకి మరో హిట్ దొరికింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన 'కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు