'ఆ వ్యసనానికి నేనూ బానిసనే..' 'తిప్పరామీసం' టీజర్!

Published : Sep 06, 2019, 10:01 AM ISTUpdated : Sep 06, 2019, 11:00 AM IST
'ఆ వ్యసనానికి నేనూ బానిసనే..' 'తిప్పరామీసం' టీజర్!

సారాంశం

రీసెంట్‌గా ‘బ్రోచేవారెవరురా’తో హిట్ కొట్టిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తోన్న తాజా చిత్రం ‘తిప్పరామీసం’. ఈ సినిమాలో మరో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.తాజాగా సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది.   

హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి వైవిధ్యమైన కథల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు శ్రీవిష్ణు. ఇటీవల 'బ్రోచేవారెవరురా' సినిమాతో హిట్ అందుకున్న ఈ నటుడు తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడు.

అదే 'తిప్పరామీసం'. ఈ సినిమాలో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. 'మందు సిగరెట్ అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే' అంటూ టీజర్ లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్ తో శ్రీవిష్ణు కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. టీజర్ లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా నిక్కీ తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణా విజయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే