జూబ్లీహిల్స్ సీబీఐ కాలనీలోని కార్యాలయంలో విష్ణుకు చెందిన రూ.5లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామగ్రిని చెప్పకుండా, ఎలాంటి ఫర్మిషన్ లేకుండా తీసుకెళ్లాడు. ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదు.
సినీనటుడు మంచు విష్ణు పర్శనల్ హెయిర్ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆయన ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా.. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మంచు విష్ణు వద్ద బోరబండకు చెందిన యు.నాగశ్రీను హెయిర్ సైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న జూబ్లీహిల్స్ సీబీఐ కాలనీలోని కార్యాలయంలో విష్ణుకు చెందిన రూ.5లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామగ్రిని చెప్పకుండా, ఎలాంటి ఫర్మిషన్ లేకుండా తీసుకెళ్లాడు. ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదు. చోరీకి పాల్పడినట్లు లీగల్ మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు.
undefined
హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనునే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని, అతను ఈ చోరీ జరిగినప్పటినుంచి కనిపించడంలేదని విష్ణు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు. మరి ఈ విషయమై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక గత కొద్ది రోజులుగా మంచు విష్ణు ఏదో విధంగా వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై చేసిన కామెంట్స్ తరువాత మంచు విష్ణుని వరసపెట్టి ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. ఇక ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా విడుదలైన తరువాత ట్రోలింగ్ పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. తమ మీద ట్రోలింగ్ ఆపకపోతే పదికోట్ల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు మంచు ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్ లంటూ వచ్చిన వార్తలపై కూడా ఓ రేంజ్ లో విమర్శలు చేస్తూ నెటిజన్స్ మరో సారి ట్రోలింగ్ కి పూనుకున్నారు.