
క్రేజీ హీరో శర్వానంద్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నేను శైలజ, చిత్రలహరి లాంటి హిట్ మూవీస్ తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్ కి తగ్గట్లుగా ఈ చిత్రంలో నటీమణులు ఎక్కువగా ఉన్నారు.
సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఫుల్ ఫన్ రైడ్ లా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ పెళ్లి చూపులతో ఇబ్బంది పడే యువకుడిగా కనిపిస్తున్నాడు.
వచ్చిన ప్రతి సంబంధాన్ని ఎదో ఒక వంక పెట్టి వాళ్ళింట్లో ఆడవాళ్లు చెడగొడుతూ ఉంటారు. 'ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు చూస్తే సెంటిమెంట్ గా ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది అంట కదా' అనే ఫన్నీ డైలాగ్ వినిపిస్తుందాయే ట్రైలర్ మొదలవుతుంది.
వరుసగా సంబంధాలు చెడిపోతున్న టైం లో శర్వానంద్ కి రష్మిక మందన సంబంధం వస్తుంది. రష్మిక తల్లి పాత్రలో ఖుష్బూ నటిస్తున్నారు. ఖుష్బూ పెళ్లి చూపుల్లో శర్వానంద్ ఫ్యామిలీకి పెట్టె కండిషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి.
పిల్లలు పుట్టాక మా అమ్మాయి ఉద్యోగానికి వెళుతుంది. నువ్వు ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకోవాలి. ఇది నీకు ఒకే కదా అని ఖుష్బూ అడగడం చాలా ఫన్నీగా ఉంది. చివరకు శర్వానంద్ రష్మికకే ఎలా ఫిక్స్ అయ్యాడు అనేది సినిమాలో సస్పెన్స్. మొత్తంగా ట్రైలర్ ఫుల్ ఫన్ రైడ్ లా అనిపిస్తోంది. శర్వానంద్ ఫన్నీ హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. కిషోర్ తిరుమల చక్కటి హాస్యభరితమైన సీన్స్ ఈ చిత్రం కోసం రాసుకున్నట్లు ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.