#Acharya:కొరటాల శివ ఇంటి వద్ద ‘ఆచార్య’ ఎగ్జిబిటర్స్ ధర్నా?

Published : Jul 13, 2022, 03:38 PM IST
 #Acharya:కొరటాల శివ ఇంటి వద్ద ‘ఆచార్య’ ఎగ్జిబిటర్స్ ధర్నా?

సారాంశం

చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రధారులుగా రూపొందిన 'ఆచార్య'  కి కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే కథాకథనాల విషయంలోను .. సంభాషణల విషయంలోను ఎక్కడా కొరటాల మార్కు కనిపించకపోవడంతో అభిమానులు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి ఆటతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో వీకెండ్ లోనే ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. 

    


మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. సెన్సిబుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం  భాక్సాఫీస్ దగ్గర  డిజాస్టర్ అన్న సంగతి తెలిసిందే.  ఆ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు. చిరు, చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. దర్శకుడు కొరటాలకు ఫ్లాఫ్ అంటే ఎలా ఉంటుందో  చూపించింది ఈ చిత్రం. అప్పటిదాకా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న శివ ఒక్కసారిగా ఆందోళనలో పడే పరిస్దితి. అటు మెగాభిమానుల నుంచి కాకుండా ఇండస్ట్రీ నుంచి ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఆచార్య కష్టాలు శివను ఇంకా వదలడం లేదు.

‘ఆచార్య’ సినిమాతో భారీ నష్టాలు చవిచూసిన 25 మంది ఎగ్జిబిటర్లు కొరటాల ఆఫీసు ముందు నిన్న రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారని సమాచారం. సినిమాను కొని తాము రూ. 15 కోట్ల వరకూ నష్టపోయామని ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం, ప్రకటన ఏమీ లేదు. 
 
విడుదలకు ముందే ఈ చిత్రాన్ని నిర్మాతల దగ్గర నుంచి కొరటాల శివ తీసుకున్నారట. అందుకే బయ్యర్లు నష్టాన్ని కొరటాలనే భరించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.   ఆ నష్టాన్ని స్వయంగా చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ సెటిల్ చేస్తామని మాటిచ్చారట. చిరంజీవి చేయాల్సిందేదో చేసేశాడట. కానీ, కొరటాల శివ సెటిల్‌మెంట్ ఇంకా జరగలేదని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించి కొరటాల శివే అంతా చూసుకున్నాడు. కాబట్టి నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లను ఆదుకోవడం అనే అతి పెద్ద బాధ్యత కూడా కొరటాల శివదే అంటున్నారు. అయితే, ఇన్నాళ్లయినా కొరటాల శివ సెటిల్‌మెంట్ చేయలేదని అనటం మాత్రం ఆశ్చర్యంగా ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..