'చెన్నకేశవ రెడ్డి' రీరిలీజ్ ...ఎన్టీఆర్ అభిమానులపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్,వివాదం

By Surya PrakashFirst Published Sep 25, 2022, 4:30 PM IST
Highlights

దేవి థియేటర్లో చెన్నకేశవరెడ్డి రీ-రిలీజ్ కి హంగామా జరుగుతోంది. అక్కడకి  వచ్చిన జూనియర్ అభిమానులతో కొందరు  బాలయ్య అభిమానులు గొడవపడ్డారని తెలుస్తోంది.

 గతంలో సూపర్ హిట్ గా నిలిచిన పలు హీరోల సినిమాలను ఆయా హీరోల పుట్టినరోజు లేదా సినిమా వార్షికోత్సవం సందర్భంగా సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు, మహేష్ బాబు...ఒక్కడు, పోకిరి వంటి సినిమాలను రీ రిలీజ్ చేసిన నిర్మాతలు ఇప్పుడు బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా 20 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మరోసారి సినిమానే రిలీజ్ చేసారు. అయితే అదే సమయంలో బాలయ్య ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు RTC X Roads దేవి థియేటర్లో చెన్నకేశవరెడ్డి రీ-రిలీజ్ కి హంగామా జరుగుతోంది. అక్కడకి  వచ్చిన జూనియర్ అభిమానులతో కొందరు  బాలయ్య అభిమానులు గొడవపడ్డారని తెలుస్తోంది. ఎవడ్రా జూనియర్ ఎన్టీఆర్, వాడు ఎన్టీఆర్ బ్లడ్డే కాదు అంటూ బూతులు తిట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  అందుకు కారణం ఎన్టీఆర్ చేసిన ట్వీట్.

‘‘ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు.. 'విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’’.. రాజకీయాలను పక్కనపెడితే.. జూనియర్ ఎన్టీఆర్ ఎంత హుందాగా స్పందించారు. నొప్పించక తానొప్పక అన్నట్టుగానే.. అందర్నీ మెప్పించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

ఎన్టీఆర్‌తో వైఎస్సార్‌ను పోల్చడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. జూ.ఎన్టీఆర్ సరైన రీతిలో స్పందించలేదని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఇక్కడ సినిమా థియేటర్స్ వద్ద కూడా ఇలా గొడవలు చోటు చేసుకున్నాయి.

మరో ప్రక్క బాలయ్య...‘‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలయ్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
 

click me!