Bigg Boss Telugu 7 : లాస్ట్ సీజన్ లో వాళ్లిద్దరు.. ఇప్పుడు యావర్ కూడా! ఇంట్రెస్టింగ్

Published : Dec 15, 2023, 08:32 PM ISTUpdated : Dec 15, 2023, 08:35 PM IST
Bigg Boss Telugu 7 :  లాస్ట్ సీజన్ లో వాళ్లిద్దరు.. ఇప్పుడు యావర్ కూడా! ఇంట్రెస్టింగ్

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Teugu 7 )తో ప్రిన్స్ యావర్ టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. తెలుగు భాష రాకున్నా.. లేటెస్ట్ సీజన్ లో ఫైనల్స్ కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. లాస్ట్ సీజన్ లోనూ ఇద్దరు కంటెస్టెంట్లూ ఇలాగే ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. 

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 రెండ్రోజుల్లో ముగినుంది. ఆదివారం విన్నర్ ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఫైనల్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, యావర్, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్స్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటికే లాస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ సందర్భంగా విన్నర్ ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ప్రిన్స్ యావర్ (Yawar)  ఇంట్రెస్టింగ్ గా మారారు. మోడల్ గా, సీనియర్ యాక్టర్ గా యావర్ ఆడియెన్స్ కు ముందే పరిచయం అయ్యారు. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీవీ ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.... యావర్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినా తెలుగులో అనర్గళంగా మాట్లాడటం రాదు. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటిరోజే హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈ విషయం అడిగారు. 

యావర్ నీకు తెలుగు రాదుకదా... మరి తెలుగు ఆడియెన్స్ కు ఎలా రీచ్ అవుతావు అంటూ ప్రశ్నించారు. యావర్ నేర్చుకుంటానని మాటిచ్చాడు. వందరోజుల ఈ గేమ్ షో ప్రస్తుతం ముగింపునకు చేరుకుంది. కానీ ఇప్పటికీ యావర్ పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోవడం గమనార్హం. అయినా యావర్ తన ఆటతీరుతో ఫైనల్స్ కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. టైటిల్ రేసు లో పోటీపడుతుండటం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఇలాగే లాస్ట్ సీజన్ లోనూ ఇద్దరు కంటెస్టెంట్లు ఫైనల్స్ చేరారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అన్నీ వివాదాలు, విమర్శలు ఎదుర్కొంది. అయినా చివరికి ఆడియెన్స్ కు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. ఇక లాస్ట్ సీజన్ లో రోహిత్, కీర్తి  కూడా ఫైనల్స్ కు చేరుకున్నారు. ఈ సీజన్ లో యావర్ ఫైనల్ రావడంతో వారిద్దరిని గుర్తుచేసింది. ఇక ఆదివారం విన్నర్ ఎవరనేది తేలనుంది. టైటిల్ రేసులో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్, అర్జున్ ఉన్నారు. ఎవరు విజేతగా నిలుస్తారోనన్నది వేచి చూడాల్సి ఉంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా