వదినమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన నిహారిక.. బ్యూటిఫుల్ పోస్ట్ వైరల్

By tirumala ANFirst Published Dec 15, 2023, 5:14 PM IST
Highlights

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్ తన ప్రేయసి నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్ తన ప్రేయసి నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ లో వరుణ్ లావణ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

ఎక్కడగా తమ ప్రేమ గురించి బయట పడకుండా ఎంగేజ్మెంట్ వరకు లావణ్య, వరుణ్ జాగ్రత్త పడ్డారు. మిస్టర్ మూవీతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం వివాహబంధంలో అడుగుపెట్టే వరకు సాగింది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ కపుల్ తమ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు లావణ్య త్రిపాఠి 33 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. 

Latest Videos

పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ బర్త్ డే. దీనితో లావణ్య త్రిపాఠికి మెగా అభిమానుల నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల.. తన వదినమ్మకు స్వీట్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. 

అత్యుత్తమమైన నీకు హ్యాపీయెస్ట్ బర్త్ డే. నీ జీవితంలో మరింతగా సంతోషం, ప్రేమ, ప్రశాంతత వెల్లివిరియాలి. లవ్యూ వదిన అంటూ నిహారిక లావణ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పెళ్లి నాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య హనీ మూన్ ఎంజాయ్ చేస్తున్నారు. 

 

click me!