తమిళ స్టార్ విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబోలో ‘లియో’ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా లోకేష్ మూవీ అప్డేట్స్ పై స్పందించారు. దీంతో ఫ్యాన్స్ లో సందడి మొదలైంది.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) - లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో ఇప్పటికే ‘మాస్టర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కరోనాకు ముందు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. ‘విక్రమ్’తో బ్లాక్ బాస్టర్ అందించిన తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవడం, షూటింగ్ కొనసాగుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ అందనున్నాయని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా లోకేష్ కనగరాజ్ స్పందించారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్వీటర్ వేదికన స్పందించారు. చిత్రం నుంచి రాబోయే అప్డేట్స్ ను ఉద్దేశిస్తూ.. ‘రెడీ హా?’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎలాంటి అప్డేట్ వస్తుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. లోకేషే స్వయంగా స్పందిస్తూ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. జూన్ 22న విజయ్ దళపతి పుట్టిన రోజు ఉన్న సందర్భంగా ఈ అప్డేట్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ‘అల్టర్ ఇగో నా రెడీ’ పేరిట ఫస్ట్ సింగిల్ రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా మారింది.ఇక అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు కొద్దిరోజులుగా వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసే పనిలో ‘లియో’ యూనిట్ నిమగ్నమైందని తెలుస్తోంది.
అలాగే నిమిషం 14 సెకండ్ల నిడివి గల పవర్ ఫుల్ లియో గ్లింప్స్ కూడా రానుందని అంటున్నారు. ఫ్యాన్స్ కు ఇది బిగ్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. గతంలో వచ్చిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ లోగో, పవర్ ఫుల్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. నెక్ట్స్ అప్డేట్ తో అంచనాలు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ బ్లాక్ బాస్టర్ హిట్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం Leo కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో విజయ్ దళపతి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. అలాగే చాక్లెట్ తయారు చేసే వ్యక్తిగానూ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై చిత్రాన్ని రూ.300 కోట్ల వరకు పెట్టుబడితో నిర్మిస్తున్నారు. మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ , గౌతమ్ మీనన్ ,మిస్కిన్ , మన్సూర్ అలీఖాన్ , ప్రియా ఆనంద్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
First Single on Anna's Birthday 🔥🧊 pic.twitter.com/xG5T46GWyR
— Lokesh Kanagaraj (@Dir_Lokesh)
Ready ah?
— Lokesh Kanagaraj (@Dir_Lokesh)