‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్‌కు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. ఏమైంది?

Published : May 27, 2023, 04:25 PM ISTUpdated : May 27, 2023, 04:31 PM IST
‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్‌కు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. ఏమైంది?

సారాంశం

‘ది కేరళ స్టోరీ’ చిత్ర డైరెక్టర్ సుదీప్తో సేన్ తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. దీంతో సినీలోకం ఆందోళణకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీరియర్లు కూడా ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ అదాశర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto Sen)  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం సుదీప్తో సేన్ ముంబైలో ఉంటున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

అయితే, ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుదీప్తో సేన్ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. విరామం లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కాస్తా అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పట్ల బాధపడాల్సిన పనిలేదని అంటున్నారు. 

ఇక ‘ది కేరళ స్టోరీ’ మే5 విడుదలై సంచలనం సృష్టించింది. చిత్రంపై కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత కూడా ఎదరైంది. కొన్ని రాష్ట్రాలు రాయితీలు కూడా ఇవ్వడం విశేషం. లవ్ జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం పొలిటికల్ టర్న్ కూడా తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ్గా మారింది. చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్  దక్కుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబడుతున్నట్టు తెలుస్తోంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే