Samantha Yashoda : సమంత ‘యశోద’ కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. ఆయన ఎవరంటే..

Published : Mar 20, 2022, 06:58 AM IST
Samantha Yashoda : సమంత ‘యశోద’ కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. ఆయన ఎవరంటే..

సారాంశం

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) వరుస సినిమాలతో బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం‘యశోద’మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ రంగంలోకి దిగారు.

టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా సమంత ముద్ర వేసుకున్నారు. ఆమె  సినిమా చేసిన ఆడియెన్స్ నుంచి మినిమం రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం దర్శక నిర్మాతల్లో నెలకొంది. ఈ సందర్భంగా చైతూతో విడిపోయాక.. సమంత ఇక పూర్తి సమయాన్ని సినిమాకే కేటాయిస్తోంది. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప : ది రైజ్’ (Pushpa) మూవీలోనే నటించింది. అంతకు ముందేడాది కూడా ఒక్క ‘జాను’లోనే మెరిసింది. కానీ ఈ యేట వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’(Yashoda)తో పాటు తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. 

గుణ టీంవర్క్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మాణం వహించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). సమంత నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ గతేడాదే పూర్తైయింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం సమంత ‘యశోద’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఏకంగా సెట్ లోనే ఉంటూ శరవేగంగా షూటింగ్ ముగించుకుంటున్నట్టు తెలుస్తోంది. 

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ‘యశోద’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి హరిశంకర్ మరియు హరీశ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో ఈ మూవీ చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కొంత భాగం యాక్షన్స్ సీక్వెల్స్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే ఇందుకోసం మేకర్స్ ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ (yannick ben)నే రంగంలో దించారు. 

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు కూడా యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌ను ఆయనే డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ‘యశోద’ మూవీకి యాక్షన్ పార్ట్ కు దర్శకత్వం వహిస్తున్నారు యానిక్ బెన్. ఇప్పటికే హైద‌రాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రం యూనిట్ కొడైకెనాల్‌కు వెళ్లనుంది. అక్కడే ఈ యాక్షన్ ను షూట్ చేయాలని ప్లాన్ చేశారు. దాదాపుగా మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన ఫైవ్ స్టార్ హోటల్ సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.  యానిక్ బెన్ సమంత కోసం వర్క్ చేయడం ఇది రెండోసారి. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా వర్క్ చేసి మెప్పించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా