RRR: మా బంధానికి దిష్టి తగలకూడదు.. రాంచరణ్ తో స్నేహం ఎప్పటికీ ఇలాగే, ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 19, 2022, 10:09 PM IST
RRR: మా బంధానికి దిష్టి తగలకూడదు.. రాంచరణ్ తో స్నేహం ఎప్పటికీ ఇలాగే, ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

సారాంశం

యావత్ దేశం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నేడు కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ కనీవినీ ఎరుగని విధంగా నిర్వహిస్తున్నారు.

యావత్ దేశం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నేడు కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ కనీవినీ ఎరుగని విధంగా నిర్వహిస్తున్నారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

అలాగే పునీత్ రాజ్ కుమార్ సోదరుడు హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ కూడా అతిథిగా హాజరయ్యారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా ప్రసంగించారు. పునీత్ రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు కురిసిన చిరు జల్లులలో, ఈ గాలిలో ఆయన ఇక్కడే ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణించినప్పుడు నేను ఏడవలేదు. ఏడవను కూడా. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ అంటే ఒక సెలెబ్రేషన్ అని ఎన్టీఆర్ అన్నారు. 

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇది దేవుడు నిర్ణయించిన చిత్రం అని అన్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇండియా గర్వించదగ్గ కళాఖండం అని ఎన్టీఆర్ అన్నారు. మల్టి స్టారర్ సినిమాలు ఆగిపోయిన వేళ రాజమౌళి తలపెట్టిన ప్రాజెక్ట్ ఇది. రాంచరణ్ అభిమానులు, నా అభిమానులు కలసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు అంటే అది ఈ సినిమా ఘనత అని ఎన్టీఆర్ తెలిపారు. 

రాంచరణ్ తో నా బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. మా బంధానికి దిష్టి తగలకూడదు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం పని చేసిన కెమెరామెన్ సెంథిల్, శ్రీనివాస్ మోహన్, సాబు సిరిల్, రామా రాజమౌళి, శ్రీవల్లి, కీరవాణి ఇలా అందరికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 

ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ గా ఆర్ఆర్ఆర్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, రాంచరణ్ దేశం మొత్తం చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి