సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌- 2’ రిలీజ్ డేట్

Surya Prakash   | Asianet News
Published : May 13, 2021, 11:38 AM IST
సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌- 2’ రిలీజ్ డేట్

సారాంశం

ఇండియాలో మొదటిసారి సూపర్ హిట్ అయిన  వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా రూపొందగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ పలు కారణాల రీత్యా వాయిదాపడింది. 2021 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ, వివాదాలు వచ్చే అవకాసం ఉందని అనుమానంతో ,కొన్ని సీన్స్ మార్చుకునేందుకు గానూ వాయిదా వేశారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళం, ఇంగ్లీష్ డ‌బ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. 

నటి సమంత తొలిసారి నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌- 2’. మనోజ్‌బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం పాపులర్ ఓటీటీ  అమెజాన్‌ ప్ప్రైమ్‌లో ప్రసారమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌కు ఇది సీక్వెల్.  ఆ మధ్యన ఈ సీరిస్ కు చెందిన టీజర్‌లో సమంత లుక్‌ ప్రేక్షకులలో క్యూరియాసిటీ రేకెత్తించింది. అలాగే ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ ఒక ట్విటర్‌ ఎమోజీని విడుదల చేసింది. ఇందులో మనోజ్‌ బాజ్‌పాయ్‌తో పాటు సమంత కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ తరహా ఎమోజీని దక్కించుకున్న భారతీయ మహిళ నటుల్లో సమంతనే ప్రథమం.

ఇండియాలో మొదటిసారి సూపర్ హిట్ అయిన  వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా రూపొందగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ పలు కారణాల రీత్యా వాయిదాపడింది. 2021 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ, వివాదాలు వచ్చే అవకాసం ఉందని అనుమానంతో ,కొన్ని సీన్స్ మార్చుకునేందుకు గానూ వాయిదా వేశారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళం, ఇంగ్లీష్ డ‌బ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. జూన్ 11న పార్ట్ 2ను విడుద‌ల చేస్తార‌నే టాక్ వినిపిస్తుంది.

 అయితే ఈ విషయమై అమెజాన్ ప్రైమ్ నుండి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.  మనోజ్‌ బాజ్‌పాయ్‌తో పాటు ప్రియమణి ప్రధానపాత్రలో యాక్షన్‌, స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించటంతో ఈ సీరిస్ పై మంచి హోప్స్ ఉన్నాయి !  ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించారు. ఇకపోతే సమంత ఈ సిరీస్ లో టెర్రరిస్టుగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుంది.

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో