ఎమోషనల్ అయ్యి ఏడుపొచ్చేస్తే కష్టం.. అందుకే అఖిల్ అక్కడికి రాలేదట..?

Published : Sep 14, 2022, 06:40 AM IST
ఎమోషనల్ అయ్యి ఏడుపొచ్చేస్తే కష్టం.. అందుకే అఖిల్ అక్కడికి రాలేదట..?

సారాంశం

అక్కినేని హీరో అఖిల్ కు భయం వేసిందట.. ఎమోషనల్ అయిపోయి ఏడుస్తానేమో అన్న అనుమానం వచ్చిందట.. అందుకే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన రాలేదట. ఇంతకీ ఏంటా సినిమా..? ఎందుకలాగా..?

శర్వానంద్ హీరోగా .. అమల అక్కినేని కీలకమైన పాత్రలో నటించిన  సినిమా ఒకే ఒక జీవితం.  ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ రోజు..  ఓపెనింగ్స్ డల్ గా ఉన్నప్పటికీ, ఆ తరువాత నుంచి సినిమాకు మౌత్ పబ్లిసిటీపెరిగింది. ఇక ఈసినిమాలో అమల ఉండటంతో.. ఈసినిమాతో అక్కినేని ఫ్యామిలీకి కూడా లింక్ ఏర్పడింది. దాంతో  ఈ సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని ప్యామిలీ అంతా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈసినిమా  చూసిన నాగార్జున తన తల్లి గుర్తుకు వచ్చి ఏడ్చేశారు. ఆయన ఎమోషనల్ కావడం .. ఇకపై శర్వానంద్ కూడా మా కొడుకులాంటివాడే అని చెప్పడం అంతా చకచకా జరిగిపోయాయి. 

ఇక  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా అఖిల్ వస్తాడని ప్రకటించారుగానీ ఆయన రాలేదు.చాలాసేపు అంతా ఆయన కోసం ఎదరు చూశారు. ఇక  ఫంక్షన్ చివర్లో వస్తాడేమోనని ఎదురుచూసినా..  వారికి నిరాశే ఎదురైంది. దాంతో కారణం ఏమై ఉంటుందబ్బా అని అంతా అనుకున్నారు. తాజా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకార్తీక్ క్లారిటీ ఇచ్చారు. అసలు అఖిల్ ఎందుకు రాలేదో వివరంగా చెప్పారు. సినిమా గురించి అన్ని విషయాలు  మాట్లాడుతూ ఆ విషయాన్ని గురించి కూడా ప్రస్తావించాడు. 

ఈ సినిమా ప్రివ్యూ చూసి అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత ఆయన మామూలు మనిషి కావడానికి  చాలా టైమ్ పట్టిందట. దాదాపురెండు రోజులు తరువాత ఆ ఆలోచన నుంచి ఆయన బయటకు వచ్చాడట. దాంతో...  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే ఎమోషనల్ గా తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని.. స్టేజ్ మీదనే ఏడ్చేస్తానేమో అన్న భయం కూడా వేసిందట. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని  ఈవెంట్ కు అఖిల్ రాలేదంటూ... దర్శకుడు శ్రీ కార్తీక్ చెప్పాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2.. దియా రెడ్డి పాత్రకు ఎమోషనల్ గుడ్‌బై చెప్పిన రష్మిక