తారకరత్న *కాకతీయుడు*.. ఎందుకు రిలీజ్ చేశారో?

Published : Jul 05, 2019, 01:14 PM ISTUpdated : Jul 05, 2019, 01:23 PM IST
తారకరత్న *కాకతీయుడు*.. ఎందుకు రిలీజ్ చేశారో?

సారాంశం

నందమూరి హీరో తారకరత్న నటించిన కాకతీయుడు సినిమా నేడు కొన్ని థియేటర్స్ లో రిలీజయింది. అయితే ఈ సినిమా రిలీజవుతున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు కెరీర్ మొదట్లో వరుసగా 5 సినిమాలకు సైన్ చేసిన తారకరత్న ఇప్పుడు అవకాశాల్ని అందుకోవడమే కష్టంగా మారింది.  

2015లో పూర్తయిన కాకతీయుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అప్పట్లో దాసరి నారాయణరావు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. అలాగే ఆ తరువాత రిలీజ్ చేద్దామని అనుకున్నా బిజినెస్ లేక మూలన పడింది. మొత్తానికి నేడు విడుదల చేసినప్పటికీ  థియేటర్స్ లో కూడా జనాలు కనిపించడం లేదు. 

ఒకప్పుడు సింహారాశి - శివరామరాజు - ఎవడైతే నాకేంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.సముద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మినిమమ్ గ్యారెంటీ ఉన్న ఈ దర్శకుడు కాకతీయుడుని పెద్దగా మెప్పించేలా తెరకెక్కించలేకపోయాడు. అయినా ఆర్థికంగా దెబ్బ పడ్డ సినిమాకు ఎన్నో సమస్యలు.. ఎవరిని ఏమన్నా లాభం ఉండదు. నిజంగా ఈ సినిమా రిలీజ్ కాకపోయినా బావుండేదేమో.. సినిమా ఆడదాని తెలిసినా ఈ ప్రయోగాలు చేయడం ఎందుకో?   

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్