
హిట్,ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా విక్రమ్ (Vikram) తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. వరసగా విక్రమ్ నటించిన ‘కోబ్రా’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు ఆయన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. తమిళ స్టార్ డైరక్టర్ పా.రంజిత్ (Pa Ranjith) దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.ఈ మధ్యనే పూజ జరిగి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇదొక విభిన్నమైన పీరియాడికల్ సినిమా. 1800 సంవత్సరంలో దళితులపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు.
తాజాగా ఈ సినిమాకి ‘తంగలాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీన్ని ఆఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో గ్లింప్స్‌ను పంచుకున్నారు. గ్లింప్స్ లో విజువల్స్ తీర్చిదిద్దిన తీరును బట్టి.. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో తెరకెక్కుతునట్లు క్లారిటీ వచ్చేసింది.
ఇందులో విక్రమ్ ఓ గిరిజన తెగకి చెందిన నాయకుడి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. దీన్ని పూర్తిగా త్రీడీ ఫార్మట్‌లో ఓ విజువల్ ట్రీట్‌గా రూపొందించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్ హీరోయిన్. ఈ సినిమాని తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలందిస్తున్నారు.