తమిళ స్టార్ ధనుష్ లేటెస్ట్ హిట్ ఫిల్మ్ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ధనుష్ కేరీర్ లోనే బెస్ట్ కలెక్షన్ సినిమాల జాబితాలో చేరింది.
తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ తమిళ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సార్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ‘వాతీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత నెల ఫిబ్రవరి 17న చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. నిన్నటితో సరిగ్గా నెల పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఆయా థియేటర్లలో ఆడుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. తొలిరోజే రూ.16.54 కోట్లకు పైగా కలెక్షన్స్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ ముగిసే వరకు రూ.50 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
నెలరోజులు పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.118 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తెలుగులో తొలిచిత్రంతోనే ధనుష్ బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నారు. ‘వాతీ’కలెక్షన్స్ ధనుష్ కేరీర్ లోని బెస్ట్ కలెక్షన్స్ గా నిలిచాయి. గతంలో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసిన చిత్రాలు ఉన్నాయి. కానీ ఇంత త్వరగా.. అది డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ లో ఇంతలా కలెక్షన్స్ రావడం గ్రేట్ అనే అంటున్నారు. గతంలో ‘జగమే తందిరమ్’, ‘అసురన్’, ‘వాడ చెన్నై’ ‘రాంఘానా’ వంటి చిత్రాలు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ఆ జాబితాలో ‘వాతీ’సైతం చేరింది.
మరోవైపు ప్రేక్షకులు కూడా కంటెంట్ ఉన్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారనే విషయం మరోసారి ‘వాతీ’తో తేలిపోయింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళంలో మంచి రిజల్డ్ ను సాధించింది. ఈ చిత్రానికి దక్శకత్వం వహించిన వెంకీ అట్లూరికీ మంచి క్రేజ్ దక్కింది. హీరోయిన్ సంయుక్తా మీనన్ (Samyukta Menon) సైతం ఈ చిత్రంలో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు.
కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ భారీ హిట్లను సొంతం చేసుకుంటున్న యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీనే సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘వాతీ’ సినిమాను నిర్మించారు. ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ భాగస్వామ్యంగా ఉంది. చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. మార్చి 17 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
/ is on fire!🔥
Crossing the ₹118 crore worldwide gross mark!💥🎉
Thank you for the overwhelming response!😇 pic.twitter.com/vHIp1z4eyi