Thaman Counter To Reporter : రిపోర్టర్ కు థమన్ అదిరిపోయే కౌంటర్.. సినిమా గురించి ఇకేం అప్డేట్ లేదా అన్నందుకు..

Published : Feb 23, 2022, 10:31 PM IST
Thaman Counter To Reporter : రిపోర్టర్ కు థమన్ అదిరిపోయే కౌంటర్.. సినిమా గురించి ఇకేం అప్డేట్ లేదా అన్నందుకు..

సారాంశం

‘భీమ్లా నాయక్ ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జోరుగా కొనసాగుతోంది. అయితే   సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీ సాంగ్స్ కోసం వాడిన ట్రైబల్ ఇన్ స్ట్రుమెంట్స్ గురించి తెలిపే ఏవీలో రిపోర్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.    

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), భల్లాల దేవుడు రానా దగ్గుబాటి( Rana) కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ కు హాజరైన అథితులు, టెక్నీషన్స్ సినిమా పట్ల తమ అనుభూతులను ఆడియెన్స్ తో పంచుకుంటున్నారు. 

అయితే, ఈ మూవీకి సెన్సేషన్ మ్యూజిక్ అందించిన థమన్ కూడా తన కష్టాన్ని అభిమానులకు తెలియజేస్తూ.. ఓ ఏవీని ఈవెంట్ బిగ్ స్క్రీన్ పై పంచుకున్నారు. ఈ ఏవీలో థమన్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కోసం వాడిన ట్రైబల్ ఇన్ స్ట్రుమెంట్స్ ను చూపిస్తూ.. వాటిని వాయించిన డ్రమ్స్ ప్లేయర్ ను తెలుగు ప్రేక్షకులకు తెలియజేశారు.అయితే ఈ వీడియో చివరిలో థమన్ రిపోర్టస్ తో మాట్లాడాడు. భీమ్లా నాయక్ నుంచి ఇంకేం అప్డేట్ లేదా అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు థమన్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. 

థమన్ స్పందిస్తూ.. ‘ఇప్పటి వరకు ఇచ్చిన సాంగ్స్... రానా, పవన్ కళ్యాణ్ మాస్ క్యారెక్టర్స్ ను తెలియజేసే ట్రైలర్ కూడా విడుదల చేశాం.. ఇవన్నీ అప్డేట్స్ కావా..? మొత్తం అప్డేట్స్ లోనే ఇచ్చేస్తే ఇంకా సినిమాలో ఏం చూపిస్తాం.. అంటూ’ బదులిచ్చారు. అనంతరం మరో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ డైవర్ట్ అయ్యారు థమన్...

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?