విశాల్ తో మరోసారి మిల్కీ బ్యూటీ!

Published : Nov 04, 2018, 10:26 AM IST
విశాల్ తో మరోసారి మిల్కీ బ్యూటీ!

సారాంశం

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విశాల్. ఓ వైపు నిర్మాత మండలిలో కీలకంగా వ్యవహరిస్తూ మరోవైపు హీరోగానూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే త్వరలోనే విశాల్ సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. 

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని టాక్. ఇకపోతే ఆ సినిమాలో కథానాయికగా తమన్నా ని సలెక్ట్ చేశారు. కోలీవుడ్ లో మిల్కీ బ్యూటీ రేంజ్ మళ్ళీ పెరుగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటోంది. ఇదివరకే అమ్మడు విశాల్ తో ఒక్కడొచ్చాడు అనే సినిమాచేసింది. 

ఇప్పుడు సుందరి సి ప్రాజెక్ట్ లో భాగంగా మరోసారి విశాల్ తో నటించడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం సుందర్ సి అత్తారింటికి దారేది రీమేక్ చేస్తున్నాడు. శింబు హీరోగా నటిస్తోన్న ఆ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్. ఆ సినిమా అయిపోగానే విశాల్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు సుందర్ సి. ఇక తమన్నా మెగాస్టార్ సైరా నరసింహ రెడ్డి చిత్రంలో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?