ధియేటర్స్ కు వెళ్లాలంటే భయపడుతున్న చైతు..కారణం అదే

Published : Nov 04, 2018, 10:04 AM ISTUpdated : Nov 04, 2018, 10:10 AM IST
ధియేటర్స్ కు వెళ్లాలంటే భయపడుతున్న చైతు..కారణం అదే

సారాంశం

ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడటం ..హీరోలకు ఆనందాన్ని ఇచ్చే విషయమే. ఆడియన్స్ పల్స్ తెలుసుకోవటానికి, అలాగే జనాలు ఎంజాయ్ చేస్తున్న  విధానాన్ని చూసి తాము ఎంజాయ్ చేయాలనుకోవటం కోసం థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తూంటారు. 

ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడటం ..హీరోలకు ఆనందాన్ని ఇచ్చే విషయమే. ఆడియన్స్ పల్స్ తెలుసుకోవటానికి, అలాగే జనాలు ఎంజాయ్ చేస్తున్న  విధానాన్ని చూసి తాము ఎంజాయ్ చేయాలనుకోవటం కోసం థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తూంటారు. 

అయితే నాగచైతన్య ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు చెయ్యరు. సినిమా చేసామా...ఇంకో సినిమా మొదలెట్టామా అన్నట్లు ఉంటారు. అందుకు కారణం ...ఆయన ప్రారంభ రోజుల్లో జరిగిన సంఘటన అని చెప్తున్నారు.   అప్పట్లో ఓ సినిమాని తన అభిమానులతో కలిసి చూద్దామని తెగ ఉత్సాహంగా థియేటర్ కు వెళ్లారట నాగచైతన్య. అయితే సినిమా చూస్తున్న జనం ..పూర్తికాకుండానే వెళ్లిపోతున్నారట. 

దాంతో చాలా నిరుత్సాహం వచ్చేసిందిట. ఆ విషయం పదే పదే గుర్తు వచ్చేదిట. దాని నుంచి కోలుకోవటానికి చాలా టైమ్ పట్టిందిట.   దాంతో అప్పటి నుంచి చైతూ ...తన సినిమాలు థియేటర్ కు వెళ్లి జనాల మధ్యలో కూర్చుని చూడాలనే ఆలోచనకు ఫుల్ స్టాఫ్ పెట్టేసాడట. అప్పటి నుంచి ఇంట్లోనే కూర్చుని అభిమానుల నుంచి వచ్చే కాల్స్ ని రిసీవ్ చేసుకుంటు ఉంటారు.  

రీసెంట్ గా విజయదేవరకొండ కు కూడా నోటా చిత్రం రిలీజ్ టైమ్ లో థియేటర్స్ కు ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.  అయితే సవ్యశాచి చిత్రం థియేటర్ కు వెళ్లి చూద్దామనుకున్నారట నాగచైతన్య. కానీ సినిమా టాక్ తేడా వచ్చేసరికి వెనకడుగు వేసారట. 

తన కళ్లదెరుగా జనం ..నిరుత్సాహంగా సినిమా చూడటం, కొంతమంది లేచి వెళ్లిపోవటం అనేది దర్శక,నిర్మాతలు తట్టుకోలేని విషయమే. కాబట్టి థియేటర్స్ కు దూరంగా ఉండటమే మేలు.   

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు