కామెంట్ చేయడమే వాళ్ల బతుకనుకుంటే బతకనివ్వండి.. తమన్ సంచలన వ్యాఖ్యలు!

Published : Oct 01, 2018, 10:22 AM IST
కామెంట్ చేయడమే వాళ్ల బతుకనుకుంటే బతకనివ్వండి.. తమన్  సంచలన వ్యాఖ్యలు!

సారాంశం

టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ పై కాపీ విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. వాటిపై ఏనాడు పెద్దగా స్పందించని తమన్ తనపై కామెంట్లు చేస్తున్న వారిపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ''కామెంట్ చేయడం వాళ్ల బతుకనుకుంటే బతకనివ్వండి. 

టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ పై కాపీ విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. వాటిపై ఏనాడు పెద్దగా స్పందించని తమన్ తనపై కామెంట్లు చేస్తున్న వారిపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ''కామెంట్ చేయడం వాళ్ల బతుకనుకుంటే బతకనివ్వండి. హ్యాపీగా కామెంట్ చేసుకోమనండి'' అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి పంచ్ వేశాడు.

తమన్ పై విమర్శలు ఎంతగా పెరుగుతున్నాయంటే.. ఆయన నుండి ఏదైనా పాట కొత్తగా వచ్చినా.. వెంటనే అది అతడి సొంత పాట కాదని ఇది కాపీ ట్యూన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇవి ఇప్పుడు మొదలైనవి కాదు.. ఎప్పటికి ఆగుతాయో కూడా తెలియని పరిస్థితి.

తాజాగా ఈ విషయంపై స్పందించాడు తమన్. ''నా పాటని మళ్లీ నేను వాడుకుంటే కాపీ అని ఎలా అంటారు..? ఓ రచయిత ఒక పాటలో ప్రేమ అనే పదాన్ని రాస్తారు. మరో పాటలో ప్రేమ అని రాస్తే కాపీ అంటారా..? ఇటువంటి విమర్శలను నేను పట్టించుకోను. సోషల్ మీడియాలో ఎవరో ఏవో కామెంట్స్ చేస్తే పట్టించుకునే రకం కాదు నేను. వాటికి ప్రాధాన్యత ఇస్తే నా పని నేను చేసుకోలేను.

అసలు కాపీ అనడమే తప్పు. ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. నా స్టైల్ నాది. మళ్లీ మళ్లీ కామెంట్స్ చేస్తుంటే నేనేం చేయను. నన్ను నేను కాపాడుకోవడం కోసం ఏదోకటి మాట్లాడను. కామెంట్ చేసి బతికేవాళ్లని బతకనివ్వండి. నాకు ఎలాంటి నష్టం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు
అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదు..! హీరోయిన్ శ్రీలీల అంత మాట అనేసిందేంటి..