
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), భల్లాల దేవుడు రానా దగ్గుబాటి( Rana) కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.
మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్లొన్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman), లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ కోసం ఎంత కష్ట పడ్డారో తెలిపారు. ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ రెండేండ్ల నుంచి థమన్ ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో తెలిపారు. ఎన్ని ఇన్ స్ట్రుమెంట్స్ వినియోగించారో.. ఎంత మంది టెక్నీషియన్స్ ఇందుకు పనిచేశారో.. తెలియజేశారు. నిజానికి థమన్ కూడా ఈ మూవీ సాంగ్స్ ను ఛాలెంజ్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం ఈ సాంగ్ లో ఏకంగా నలుగురు సింగర్స్ తో పాడించారు.
రామజోగయ్య శాస్త్రి మాస్ లిరిక్స్ అందించగా.. థమన్ కూడా అదే రేంజ్ లో మాస్ బీట్ ను అందించారు. రామ్ మిరియ్యాల, శ్రీ క్రిష్ణ, ప్రుథ్వీ చంద్ర, కిన్నెర మొగులయ్య గాత్రం అందించారు. అయితే ఈ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా ట్రైబల్ ఇన్ స్ట్రుమెంట్ ను వినియోగించారు థమన్. మరోవైపు తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలా కిన్నెర కళాకారుడు నాగర్ కర్నూల్ కు చెందిన దర్శనం మొగులయ్యను ఎంపిక చేయడంతో మరింత ట్రెండ్ ను సంతరించుందీ సాంగ్. ఈ సాంగ్ తో దర్శనం మొగులయ్యకు ‘పద్మ శ్రీ ’ అవార్డు కూడా ప్రదానం చేసిన విషయం తెలిసిందే.
అయితే, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకొని థమన్ రెండేండ్లుగా ఈ సాంగ్ కోసం కష్ట పడ్డారని తెలిపారు. మరోవైపు రామజోగయ్య శాస్త్రి కూడా పవన్ కళ్యాణ్ కు, థమన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సాంగ్ కోసం థమన్ కష్టం దేవుడికి ముట్టిందన్నారు. అలాగే ఆయన కూడా ఎంతో శ్రద్ధ పెట్టిన లిరిక్స్ రాసినట్టు తెలిపారు. సాంగ్ ను ఇంత హిట్ చేసినందుకు ఆడియెన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ లైవ్ ఫర్ఫార్మెన్స్ చేశారు. ఇందుకు రామజోగయ్య శాస్త్రి కూడా పాల్గోంటూ సింగర్స్ తో పాటు తన స్వరం కలిపారు.