`అమరావతికి అటు ఇటు`గా మహేష్‌, త్రివిక్రమ్‌ సినిమా.. నిజం ఏంటంటే?

Published : Mar 26, 2023, 02:50 PM ISTUpdated : Mar 26, 2023, 05:58 PM IST
`అమరావతికి అటు ఇటు`గా మహేష్‌, త్రివిక్రమ్‌ సినిమా.. నిజం ఏంటంటే?

సారాంశం

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంబంధించి టైటిల్‌ ఇప్పుడు పెద్ద సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఓ విచిత్రమైన టైటిల్‌ తెరపైకి వచ్చింది.  

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి సినిమా రాబోతుంది. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. `అల వైకుంఠపురములో` విజయం తర్వాత త్రివిక్రమ్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. పైగా వీరి కాంబినేషన్‌లో వచ్చిన `అతడు` సినిమా ఇప్పటికీ టీవీల్లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన చిత్రంగా రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇప్పటికీ ఆ సినిమాకి అంతటి ఆదరణ దక్కడంలో త్రివిక్రమ్‌ టేకింగ్‌, డైలాగ్‌లే కారణమని చెప్పొచ్చు. 

దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న `ఎస్‌ఎస్‌ఎంబీ28` చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. త్రివిక్రమ్‌ `అ` సెంటిమెంట్‌ ప్రధానంగా టైటిల్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రభానంగా `అర్జునుడు` అని, అయోధ్యలో అర్జునుడు` అని ప్రధానంగా వినిపిస్తుంది.ఈ టైటిల్‌ ఫైనల్‌ చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. 

ఈ క్రమంలో కొత్త టైటిల్‌ తెరపైకి వచ్చింది. `అమరావతికి అటు ఇటు` అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతుంది. ఈ ఊహించని టైటిల్‌కి త్రివిక్రమ్‌ పెట్టే ఆలోచనలో ఉన్నారని టాక్‌. దీంతో ఇప్పుడు ఈ టైటిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై చిత్ర వర్గాలు ఓపెన్‌ అయ్యాయని, ఈ టైటిల్స్ కి సంబంధించిన వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టైటిల్స్ నిజం కాదని, అసలు టైటిల్‌ వేరే ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. మరి ఆ టైటిల్‌ ఏంటనేది ఇప్పుడు మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.

 అయితే శ్రీరామనవమి పండుగ సందర్భంగా `ఎస్‌ఎస్‌ఎంబీ28`కి సంబంధించిన ఫస్ట్ లుక్‌, టైటిల్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. పండగ రోజు ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయాలని భావిస్తున్నారట. మరి మహేష్‌బాబు త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌పై మరో నాలుగు రోజుల్లో క్లారిటీ రాబోతుందని చెప్పొచ్చు. ఇక మహేష్‌బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిన క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం అందించారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన