తమిళ స్టార్ విజయ్ దళపతి ‘లియో’ షూటింగ్ కశ్మీర్ షెడ్యూల్ ముగిసింది. అయితే, గడ్డకట్టించే చలిలో తమ సిబ్బంది పడ్డ కష్టాలకు మేకర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy) రీసెంట్ గా ‘వారసుడు’తో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. తెలుగులో డెబ్యూ ఫిల్మ్ తోనే విజయవంతమైన ఫలితాలను అందుకున్నారు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ కాశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 56 రోజుల గల లాంగ్ షెడ్యూల్ రీసెంట్ గా పూర్తైంది. కాస్ట్ అండ్ క్రూ చెన్నైకి చేరుకుంది. ఈ సందర్భంగా కశ్మీర్ షెడ్యూల్ లో సిబ్బంది శ్రమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
డైరెక్టర్లు సాలిడ్ యాక్షన్ సీన్స్ తో వెండితెరపై మ్యాజిక్ చేస్తుంటారు. అబ్బురపరిచే సన్నివేశాలను చిత్రీకరించి ఆడియెన్స్ చేత అదుర్స్ అనిపిస్తుంటారు. అలాంటి సీన్స్ ను షూట్ చేసేందుకు ఎంతమంది కష్టపడుతారో.. ఎలాంటి పరిస్థితుల్లో వారు పనిచేస్తారో చాలా మంది తెలియదు. అందుకు సంబంధించిన ఓవీడియోనే ‘లియో’ టీమ్ తాజాగా విడుదల చేసింది. కాశ్మీర్ షెడ్యూల్ లో తమ సిబ్బంది ఎంతలా కష్టపడిందో వారిమాటల్లోనే చూపించారు. కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో లియో షూటింగ్ జరిగిందన్నారు. ప్రధాన క్రాఫ్ట్స్ అన్నీ పనిచేశాయి. అయితే కాశ్మీర్ లో షూటింగ్ కావడంతో - 10 డిగ్రీస్ ల టెంపరేచర్ లో పనిచేయాల్సి వచ్చిందటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. చలికి వణికిపోతూనే షూటింగ్ వర్క్ కొనసాగించారన్నారు. రాత్రి పగలు షూటింగ్ కొనసాగిందని తెలిపారు. ముఖ్యంగా అక్కడి చలి, స్నో, వర్షానికి ఏమాత్రం ఆగిపోకుండా షూటింగ్ పనులు నిర్వహించారన్నారు. డే అండ్ నైట్ మారుతున్న వాతావరణ, టప్ వెదర్ ను దాటుకొని షూటింగ్ పనులు కొసాగించారని చెప్పుకొచ్చారు.
రాత్రుల్లో -10 నుంచి -2 డిగ్రీల టెంపరేచర్ లోనూ వర్క్ చేశామన్నారు. తమ చేతులు బిగుసుకపోయాయని, అయినా లోకేషన్లలో చాలా వేగంగా పనిచేశామన్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఏమాత్రం సమయం వృథా చేయకుండా షూట్ కొనసాగించారన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా తమకు సంతోషంగానే ఉందని తమ అనుభూతిని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. షూటింగ్ లో సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను వాళ్ల మాటల్లోనే షూట్ చేసి వీడియోను వదిలారు. ‘లియో’ కాశ్మీర్ షెడ్యూల్ కోసం తమ హృదయాన్ని మరియు ఆత్మను అందించిన అద్భుతమైన సిబ్బందికి అభినందించారు. తమ కష్టానికి, ప్రత్యేక శ్రమకు ధన్యవాదాలు తెలిపారు.
‘లియో’ చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన Lokesh Kangaraj ఇప్పటికే విజయ్ తో ‘మాస్టర్’ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.400కు పైగా జరిగిందంటున్నారు. చిత్రంలో విజయ్ సరసన త్రిష (Trisha) నటిస్తోంది. అలాగే సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023 అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
Massive respect to the cast and crew of who worked really hard no matter what, in the process of entertaining people.
This tribute is for you all ❤️🙌🏻https://t.co/xa4jA0a3CG