#LEO క్రేజ్ తగ్గిందా? మరి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి సామీ

By Surya Prakash  |  First Published Oct 15, 2023, 8:43 AM IST

లోకేష్ కనగరాజ్ తమిళనాట తెగ ఇంటర్వూస్ ఇస్తున్నాడు. తమిళంలో భారీ క్రేజ్ కనపడుతోంది. కానీ  తెలుగు,మళయాళంలో లియో పై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. 


తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) భారీ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ మూవీ లియో(Leo) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే.ప్లాఫ్ అంటూ ఎరగని స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కించటమే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అలాగే కమల్ హాసన్​తో 'విక్రమ్' లాంటి​ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం వల్ల సినిమా భారీ రేంజ్​లో హైప్ ఉంది.   పాన్‌ ఇండియా రిలీజ్‌ కాబట్టి ఈ సారి కాస్త ఎక్కువగా ప్రమోషన్‌లు   ప్లాన్‌ చేస్తున్నారు    లోకేష్ కనగరాజ్ తమిళనాట తెగ ఇంటర్వూస్ ఇస్తున్నాడు. తమిళంలో భారీ క్రేజ్ కనపడుతోంది. కానీ  తెలుగు,మళయాళంలో లియో పై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. 

ముఖ్యంగా 19న రాబోతున్న భగవంత్ కేసరి, 20 న రాబోతున్న రవితేజ టైగర్ నాగేశ్వరావు పై కనిపిస్తున్న ఇంట్రెస్ట్ విజయ్ లియోపై కనిపించడం లేదు . అందుకు కారణం  ప్రమోషన్స్ పెద్దగా లేకపోవటమే కాదు...లియో ట్రైలర్ వచ్చాక జనాల్లో ఆ సినిమాపై అంచనాలు తగ్గటమే అంటున్నారు. అటు అనిరుద్ మ్యూజిక్ కూడా విక్రమ్, జైలర్ స్దాయిలో  లేదు అనే మాట వినబడుతుంది. లియో పై ఆసక్తి తగ్గడానికి అనిరుధ్ మ్యూజిక్, లియో ట్రైలర్ అలాగే ప్రమోషన్స్ లేకపోవడం, ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ ఫ్రీమేక్ అని ప్రచారం జరగడం ఇవన్నీ  కారణాలుగా కనబడుతున్నాయి. అదే క్రమంలో బిజినెస్ వర్గాలు మాత్రం ఇవేమీ పట్టించుకున్నట్లు లేవు.    లియోకు అద్భుతమైన థియేట్రికల్ అలాగే నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 

Latest Videos

లియో థియేట్రికల్ బిజినెస్ చూస్తే...

తమిళనాడు – 100 కోట్లు, 

ఆంధ్ర ప్రదేశ్ – 14 కోట్లు, 

తెలంగాణ- 7 కోట్లు, 

కర్నాటక – 13 కోట్లు,

 కేరళ – 16 కోట్లు, 

మిగతా భారతదేశంలో – 8 కోట్లు, 

ఓవర్సీస్ – 60 కోట్లు

 ప్రపంచవ్యాప్త థియేట్రికల్ బిజినెస్ 218 కోట్లు

ఇక లియో నాన్ – థియేట్రికల్ బిజినెస్ : సంగీతం – 16 కోట్లు, 

శాటిలైట్ – 80 కోట్లు, 

డిజిటల్ – 140 కోట్లు, 

మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ : 236 కోట్లు 

నాన్-థియేట్రికల్, థియేట్రికల్ కలిసి  మొత్తం బిజినెస్ : 454 కోట్లు 

   
  'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో విలన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.
 

click me!