`దళపతి` విజయ్‌ డైరెక్ట్‌ తెలుగు సినిమా.. డైరెక్టర్‌ ఎవరంటే?

Published : May 03, 2021, 11:18 AM IST
`దళపతి` విజయ్‌ డైరెక్ట్‌ తెలుగు సినిమా.. డైరెక్టర్‌ ఎవరంటే?

సారాంశం

ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు ప్రస్తుతం తెలుగు, హిందీలో రూపొందుతున్నాయి. `కేజీఎఫ్‌`కూడా కన్నడ, తెలుగులో ఏకకాలంలో రూపొందుతుంది. ఈ నేపథ్యంలో `దళపతి` విజయ్‌ కూడా ద్విభాషా చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.   

`బాహుబలి`.. సినిమా లెక్కల్ని మార్చేసింది. పాన్‌ ఇండియా సినిమాలు పుట్టుకొస్తున్నాయి. మార్కెట్‌ లెక్కలు మారిపోయాయి. భాష అనే బారియర్స్ బ్రేక్‌ అయ్యాయి. కొత్త మార్కెట్లు ఓపెన్‌ అయ్యాయి. మొత్తంగా సినిమా వ్యాపారమే పెరిగిపోయింది. ఒక భాష హీరో ఇతర భాషల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు ప్రస్తుతం తెలుగు, హిందీలో రూపొందుతున్నాయి. `కేజీఎఫ్‌`కూడా కన్నడ, తెలుగులో ఏకకాలంలో రూపొందుతుంది. ఈ నేపథ్యంలో `దళపతి` విజయ్‌ కూడా ద్విభాషా చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. 

సాధారణంగా విజయ్‌ సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. కాకపోతే వాటిని డబ్‌ చేసి విడుదల చేస్తుంటారు. కానీ ఈ సారి విజయ్‌ డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ ని మించిన ఇండస్ట్రీగా రాణిస్తుంది. దీంతో టాలీవుడ్‌పై విజయ్‌ ఆసక్తిచూపిస్తున్నారని టాక్. అదే సమయంలో తెలుగు డైరెక్టర్‌ వంశీపైడిపల్లి ఇటీవల విజయ్‌ని కలిసి ఓ కథ నెరేట్‌ చేశాడని, అందుకు విజయ్‌ సూత్రప్రాయంగా ఓకే చెప్పారని, ఫుల్‌ స్ర్కిప్ట్ తో రమ్మని చెప్పారని తెలుస్తుంది. ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇక ఈ ఏడాది సంక్రాంతికి `మాస్టర్‌` చిత్రంతో వచ్చారు విజయ్‌ ఈ సినిమా తెలుగులో అంతగా ఆదరణ పొందలేదు. కానీ తమిళంలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన తన 65వ చిత్రలో నటిస్తుంది. దీనికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు