Beast OTT Date: విజయ్‌ `బీస్ట్` ఓటీటీ డేట్‌ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Published : Apr 17, 2022, 01:55 PM IST
Beast OTT Date: విజయ్‌ `బీస్ట్` ఓటీటీ డేట్‌ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

సారాంశం

ధళపతి విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన `బీస్ట్` చిత్రం ఇటీవల విడుదలై థియేటర్‌లో రన్‌ అవుతుంది.డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యిందట. 

ఇళయ దళపతి విజయ్‌(Vijay) నటించిన లేటెస్ట్ మూవీ `బీస్ట్`(Beast). బుధవారం (ఏప్రిల్‌ 13)న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంటుంది. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించిన ఈ చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీగా విడుదలైంది. విజయ్‌కి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంది. దీంతో సౌత్‌ భాషలతోపాటు హిందీ, ఓవర్సీస్‌లోనూ రిలీజ్‌ చేశారు. 

అయితే ప్రారంభం నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. తమిళంలో ఓకేగానీ, తెలుగుతోపాటు హిందీ, ఇతర భాషల్లో మాత్రం పూర్తి డివైడ్‌ టాక్‌ వస్తుంది. ముక్తకంఠంతో దీన్ని ఫ్లాప్‌ సినిమాగా చెబుతున్నారు నెటిజన్లు. అయితే తమిళంలో మాత్రం కలెక్షన్ల పరంగా ఫర్వాలేదు. విజయ్‌కి తమిళనాట భారీ ఫాలోయింగ్‌ ఉంది. .దీంతో ఇప్పటికే సినిమా వంద కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసినట్టు సమాచారం. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది. ఓటీటీలో వచ్చే డేట్‌ ఫిక్స్(Beast Ott Date) అయినట్టు సమాచారం. ఈ చిత్ర ఓటీటీ హక్కులను సన్‌ నెక్ట్స్, నెట్‌ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. సినిమా విడుదలైన 28 రోజులకు ఓటీటీలో దీన్ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నారట. అంటే మే 11న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, సన్‌ నెక్ట్స్ ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు. థియేటర్‌లో పెద్దగా సక్సెస్‌ కానీ ఈ చిత్రం మరి ఓటీటీలో ఆకట్టుకుంటుందేమో చూడాలి. 

షాపింగ్‌ మాల్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది.  చెన్నైలోని నడిబొడ్డున్న ఉన్న షాపింగ్‌ మాల్‌ని టెర్రరిస్ట్ లు హైజాక్‌ చేస్తారు. అందులో రా ఏజెంట్‌ అయిన వీర రాఘవన్‌ ఉంటారు. ఆయన టెర్రరిస్ట్ లను ఎదుర్కొని, షాపింగ్‌ మాల్‌ని, అందులో ఉన్న 150 మంది ప్రజలను ఎలా రక్షించాడనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇదిలా ఉంటే విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తన 66వ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే