Kgf 2 : సల్మాన్ ఖాన్ రికార్డును బ్రేక్ చేసిన యష్.. ఓపెనింగ్ వీకెండ్ లో దుమ్ములేపుతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’..

Published : Apr 17, 2022, 01:27 PM ISTUpdated : Apr 17, 2022, 01:30 PM IST
Kgf 2 : సల్మాన్ ఖాన్ రికార్డును బ్రేక్ చేసిన యష్.. ఓపెనింగ్ వీకెండ్ లో దుమ్ములేపుతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’..

సారాంశం

కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వరల్డ్ వైడ్ బ్లాక్ బాస్టర్ గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేస్తున్నారు యష్. తాజాగా సల్మాన్ ఖాన్ ను కేజీఎఫ్ క్రేజ్ తో వెనక్కి నెట్టాడు.   

బ్లాక్ బాస్టర్ కన్నడ చిత్రం Kgf Chapter 2 ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజువల్స్, హీరోయిజం, క్యారెక్టర్ ఎలివేషన్స్ తో ఆకట్టుకుంటోంది. వరల్డ్ వైడ్ రీచ్ తో అన్ని ఇండస్ట్రీలకు గట్టి పోటీనిస్తోంది. కలెక్షన్ల పరంగానూ కేజీఎఫ్ 2 దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం వీకెండ్ ఎర్నింగ్ మతిపోగొడుతోంది. ఇప్పటికే బాహుబలి (Bahubali), ఆర్ఆర్ఆర్ (RRR) వసూళ్లను దాటేందుకు కొంచెం దూరంలో ఉన్నాడు యష్. ఈ క్రమంలో మరో రికార్డును బద్దలు కొట్టాడు యష్.

కన్నడ స్టార్ హీరో యష్ ఏకంగా బాలీవుడ్ హీరోలతో పోటీపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓపెనింగ్ వీకెండ్ చిత్రాల వసూళ్లను దాటేశాడు యష్. మూడురోజుల్లో కేజీఎఫ్ చాప్టర్ 2తో 140 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సల్మాన్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశారు. తొలిమూడు రోజులు సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హే’ చిత్రం రూ.114.93 కోట్లు వసూళ్లు చేసి బిగ్గర్ ఓపెనింగ్ వీకెండ్ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు రేస్ 3తో రూ.106.47 కోట్లు, సుల్తాన్ తో  రూ.105.53 కోట్లు వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు సల్మాన్ ఖాన్. అయితే యష్ నటించిన కేజీఎఫ్ 2 మూడు రోజుల్లో 140 కోట్ల వసూళ్లు రాబట్టి సల్మాన్ ఖాన్ రికార్డులను బ్రేక్ చేసింది. 

మరోవైపు తొలి వీకెండ్ పూర్తయ్యే వరకు యష్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టేందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2కి ఉన్న క్రేజ్ చూస్తే ఈసీగా యష్ ఈసారి ప్రభాస్ (Prabhas), ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా బ్రేక్ చేసేట్టుగా కనిపిస్తోంది. హుంబలే ఫిల్మ్ప్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేశారు. యష్ ప్రధాన పాత్రను పోషించగా.. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి (Sri Nidhi Shetty) నటించారు.  సంజయ్ దత్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ పలు కీలక పాత్రలను పోషించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?