విడుదలకు ముందే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రికార్డులు!

Published : Mar 27, 2019, 12:39 PM IST
విడుదలకు ముందే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రికార్డులు!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలను, కొన్ని కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

సినిమాలో చంద్రబాబు నాయుడుని నెగెటివ్ గా చూపించారని టీడీపీ కార్యకర్తలు సినిమాను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది. ఆ క్రేజ్ ఇప్పుడు సినిమా ఓపెనింగ్స్ లో చూపిస్తుంది. శుక్రవారం నాడు విడుదల కానున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

బుకింగ్స్ మొదలైన పది నిమిషాల్లో కేవలం ఒక్క థియేటర్ లో వెయ్యి టికెట్లు అమ్ముడైనట్లుగా వెల్లడించారు దర్శకుడు వర్మ. దీని గురించి ఆయన చెబుతూ.. ''ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు మహానాయకుడు కన్నా  'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే  నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య'' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా