పవన్, సాయి ధరమ్ తేజ చిత్రం రిలీజ్ డేట్

Published : Feb 25, 2023, 08:19 AM IST
 పవన్, సాయి ధరమ్ తేజ చిత్రం రిలీజ్ డేట్

సారాంశం

 ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫాంట‌సీ డ్రామా సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. 

తమిళ హిట్ 'వినోదయ సీతమ్' సినిమా రీమేక్  ఓకే చేసిన  పవన్ కళ్యాణ్.. ఈ సినిమాను కూడా కంప్లీట్ చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా లాంచ్ చేసి షూటింగ్ మొదలెట్టారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా భాగం కాబోతుండటంతో మెగా అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేసింది.  ప్రస్తుతం శరేవేగంగా షూటింగ్ జరుపుతున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఆగస్ట్ 15 లేదా ఆగస్ట్ 25 న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలైలోగా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల‌ని టార్గెట్‌ సెట్ చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఆ మేరకు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. అయితే అఫీషియల్ గా ఈ మేరకు ప్రకటన చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.  ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ారు. గోపాల గోపాల తర్వాత పవన్ దేవుడుగా కనిపిస్తున్న చిత్రం ఇదే. 

ఈ ఫాంట‌సీ డ్రామా సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేవ‌లం 20 రోజులు మాత్ర‌మే డేట్స్ కేటాయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అనుకోకుండా ప్ర‌మాదంలో క‌న్నుమూసిన ఓ వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో ఈ రీమేక్ క‌థ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రీమేక్‌కు దేవ‌ర‌, దేవుడు అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌ల‌తో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వినోధ‌య సీత‌మ్ రీమేక్‌కు అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాష‌ణ‌ల‌ను అందించ‌బోతున్నారు. 

 ఒరిజినల్ వెర్షన్‌లో ఎలాంటి పాటలు లేవు కానీ తెలుగు స్క్రిప్ట్‌ను పూర్తిగా మారుస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పేసేలా ఓ మాస్ మసాలా నెంబర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.  తెలుగు వర్షన్ రీమేక్ కి కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. మాటలు అందిస్తూ తెర వెనుక అన్నీ తానై చూసుకోబోతున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?