Guppedantha Manasu: రిషి వసులను చూసి కుళ్ళుకుంటున్న దేవయాని.. దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార?

Published : Feb 25, 2023, 07:08 AM IST
Guppedantha Manasu: రిషి వసులను చూసి కుళ్ళుకుంటున్న దేవయాని.. దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార?

సారాంశం

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్లో మహేంద్ర బయటకు వెళ్తుండగా దేవయాని పిలిచి మీ మొగుడు పెళ్ళాం ఇద్దరు ఏమనుకుంటున్నారు అనడంతో ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు వదిన గారు అని అంటాడు మహేంద్ర. రిషికి జ్వరం వస్తే నువ్వు నేను చూసుకోవాలి కాని మధ్యలో ఆ వసుధార ఏంటి. అయిన తను ఇంటికి రావడం ఏంటి మధ్యలో మనం పక్కకు జరపడం ఏంటి అనగా అప్పుడు మహేంద్ర వదిన గారు మనకు ఇలాంటి టైంలో జ్వరం తగ్గడం ఇంపార్టెంట్ వదిన గారు అయినా తనకి ఎవరితో అంటుండగా మహేంద్ర జగతి చిన్నప్పుడు రిషి ని వదిలి వెళ్ళిపోయినప్పుడు రిషి ని పెంచి పెద్ద చేసింది నేను అని అంటుండగా ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. రిషి మనసేంటో నాకు తెలుసు రిషి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అంటుంది.

రాజాగతి ఫస్ట్ వసుధారని ఇంట్లో నుంచి పంపించేస్తారా లేదా మీకు ఎలా ఉందో కానీ నాకు లోకానికి మాత్రం బాగుండదు ఫస్ట్ పంపించేయండి అని అంటుంది. మొదటినుంచి నేను ఇంట్లోకి పిలుచుకొని రావద్దు అని మొత్తుకొని చెబుతూనే ఉన్నాను నా మాట మీరు వినలేదు. ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని అంటుండగా వదినగారు ప్లీజ్ ఇంక మీరు మాట్లాడకండి అని అంటాడు మహేంద్ర. మీకు ఉన్న మర్యాదగా నిలబెట్టుకొని ఆ గౌరవాన్ని కాపాడుకోండి ఇంతకుముందు లాగే పెత్తనం చాలా ఇస్తాను అంటే కుదరదు అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర. అది కాదు మహేంద్ర అనగా వదినగారు ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

మరొకవైపు వసుధార, రిషి కోసం జ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి అన్న మాటలు తలుచుకొని రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. మీరు నా మీద ఎంత అరిచినా కూడా మీ మీద ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది మీ కోపం మీదే నా ప్రేమ నాదే అని అంటుంది. ఇంతలోనే రిషి నిద్ర లేవడంతో కింద పడిపోతుండగా వసుధార మీకు ఎంత జ్వరం వచ్చిందో మీకు కూడా తెలుసు ఉండండి అంటూ రిషి కూర్చోబెడుతుంది వసుధార. అప్పుడు వసుధార జ్యూస్ తాగండి సార్ అనగా నాకు తాగాలనిపించడం లేదు అనడంతో జ్వరం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది సార్ కానీ తాగాలి అని అంటుంది. నీకేం ఎన్నైనా చెప్తావ్ జ్వరం నాకు వచ్చింది నాకు తాగాలనిపించలేదు అనగా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు కదా సార్ అని అంటుంది వసుధార.

మీరు అంతలా జ్వరంతో మూలుగుతుంటే నాకు భయం వేస్తోంది సార్ భయం కాదు దానిని ఏం పేరు పెట్టి పిలుస్తారో నాకు కూడా తెలియదు అని అంటుంది. ఇలాంటివన్నీ బాగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తావు కానీ చెప్పాల్సిన మాత్రం చెప్పవు అని అంటాడు రిషి. అప్పుడు రిషికి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది వసుధార. ఆ తరువాత వసుధారకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్తుంది. వసుధార పక్కన ఉన్నావని ఏమో జ్వరం కూడా బాగుంది. ఇన్నాళ్లు ఈ ప్రేమను ఎందుకు దాచావు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెట్టావు అనుకుంటూ ఉంటాడు రిషి. ఆ తర్వాత రాత్రి రిషి నిద్రలేవగా అప్పుడు వసుధార ఒకచోట కూర్చుని అలాగే పడుకుని ఉండడంతో అది చూస్తాడు. తర్వాత వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉండగా అప్పుడు వసుధార నిద్ర లేవడంతో వెంటనే రిషి కళ్ళు మూసుకుంటాడు.


అప్పుడు సమయం చూసి కూర్చోండి సార్ టాబ్లెట్ వేసుకునే సమయం అయింది అని అంటుంది. అప్పుడు వసుధార ట్యాబ్లెట్ ఇచ్చి నేను వెళ్లి పాలు తీసుకుని వస్తాను సార్ అని అక్కడ నుంచి వెళ్తుండగా రిషి వసుధార చేయి పట్టుకుంటాడు. అనగా ఏమి లేదు అనడంతో మనసులో ఏదైనా ఉంటే చెప్పండి సార్ అనగా నాకు జ్వరం వస్తే నువ్వు భయపడ్డావు అని అంటాడు రిషి. వసుధార ప్రేమగా మాట్లాడడంతో ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు మరి నన్ను ఎందుకు బాధ పెట్టావు వసుధార అని మనసులో అనుకుంటూ ఉంటాడు. జ్వరం తగ్గే వరకు ఏం మాట్లాడొద్దండి నేను చెప్పినట్లు వినాలి అని అంటుంది వసుధార. మరొకవైపు దేవయాని మహేంద్ర,జగతి అన్న మాట తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

 ఏంటి మేడం మీరు ఇంకా పడుకోలేదా అనగా పడుకునే అంత ప్రశాంతత ఇంట్లో లేదు అనడంతో అదేంటి మేడం ఇల్లు ప్రశాంతంగానే ఉంది కదా అంటుంది వసుధార. చాలా ఎక్కువ చేస్తున్నావ్,  చాలా ధైర్యం ఎక్కువ మొండి దానివిఅనగా థాంక్స్ మేడం నాకు ధైర్యం మొండితనం ఉందని మీరు గుర్తించినందుకు అని అంటుంది. రిషి సార్ కి జ్వరం వస్తే వసుధార ఎక్కడ ఉంటుంది చెప్పండి పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది అని దేవయానికి రివర్స్లో స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతూ ఉంటుంది. మనం ఒకరికి చెప్పాల్సిన పని లేదు మేడం మనకు మనం తెలిస్తే చాలు అని అక్కడ నుంచి వెళ్తుండగా ఆగు వసుధార అని అంటుంది. అవన్నీ పక్కన పెట్టు నీ మెడలో తాళి సంగతి ఏంటి పెళ్లి జరిగింది అంటున్నావ్ మరి ఆ తాళిబొట్టు ఎవరు కట్టారు ఏది మాట్లాడినా తెలుగులో సమాధానం చెప్పు తప్పించుకుంటున్నావు అని అంటుంది దేవయాని.

 సమాధానం చెప్పాలి మేడం కానీ నేను చెప్పను ఈ తాళికి ఎవరైతే కారణమో వాళ్లే చెప్తారు అని అంటుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదు మేడం అని వెళ్ళిపోతుంది. మరోవైపు మహేంద్ర రిషి హెల్త్ ఎలా ఉంది అనగా టెంపరేచర్ తగ్గిపోయింది సార్ కి రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటుంది వసుధార. అప్పుడు వారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్