మరో సీరియల్‌ నటుడికి కరోనా.. గృహలక్ష్మీ షూటింగ్‌కు బ్రేక్‌

Published : Jun 26, 2020, 01:48 PM ISTUpdated : Jun 27, 2020, 08:03 PM IST
మరో సీరియల్‌ నటుడికి కరోనా.. గృహలక్ష్మీ షూటింగ్‌కు బ్రేక్‌

సారాంశం

ఇంటిటి గృహలక్ష్మీ అనే సీరియల్‌లో నటిస్తున్న హరికృష్ణ అనే నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. హరికృష్ణకు కరోనా సోకటంతో శుక్రవారం జరగాల్సిన సీరియల్ షూటింగ్ వాయిదా పడింది. హరికృష్ణ ఇటీవల కరోనా ప్రభాకర్‌తో సన్నిహితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

సినిమా, టెలివిజన్‌ రంగాల్లో కరోనా మహమ్మారీ గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌లు లేక సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా షూటింగ్ లు ప్రారంభం కాగా నటీనటులకు కరోనా సోకుతుందన్న భయం ఎక్కువవుతోంది. ఇప్పటికే సూర్యకాంతం అనే సీరియల్‌లో నటిస్తున్న ప్రభాకర్‌ అనే ఆర్టిస్ట్‌కు కరోనా సోకటంతో ఆ సీరియల్‌ షూటింగ్‌ను నిలిపివేశారు. తాజాగా మరో సీరియల్‌ నటుడి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది.

ప్రముఖ వార్త సంస్థ సాక్షి కథనం మేరకు `ఇంటిటి గృహలక్ష్మీ` అనే సీరియల్‌లో నటిస్తున్న హరికృష్ణ అనే నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. హరికృష్ణకు కరోనా సోకటంతో శుక్రవారం జరగాల్సిన సీరియల్ షూటింగ్ వాయిదా పడింది. హరికృష్ణ ఇటీవల కరోనా ప్రభాకర్‌తో సన్నిహితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభాకర్‌తో కలిసి నటించిన వారికి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్‌ రాక ముందే ఇతర షూటింగ్ లు నిర్వహించటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో కోరాలు చాస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రతీ రోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అన్ని రంగాల్లో సడలింపులు ఇవ్వటంతో కేసు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నటీనటులకు, సాంకేతిక వర్గానికి ఇతర యూనిట్‌ సభ్యులకు ఇన్సూరెన్స్‌ చేయించాలని సినీ, టీవీ కార్మికులు కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్