ప్రముఖ తెలుగు నిర్మాత ఆఫీస్‌లో కరోనా?

Published : Jun 26, 2020, 01:29 PM IST
ప్రముఖ తెలుగు నిర్మాత ఆఫీస్‌లో కరోనా?

సారాంశం

రీసెంట్ గా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సైతం కరోనా భారిన పడ్డారు. దాంతో కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ తెలుగు నిర్మాతకు సంభందించిన ఆఫీస్ స్టాఫ్ కు కరోనా వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి

దేశంలో ప్రస్తుతం కరోనా విళయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నా పెద్దా ముసలి ముతకా అనే తేడా లేకుండా మహమ్మారి బారిన పడుతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సైతం కరోనా భారిన పడ్డారు. దాంతో కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ తెలుగు నిర్మాతకు సంభందించిన ఆఫీస్ స్టాఫ్ కు కరోనా వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వెంటనే ఆ  నిర్మాత తన ఆఫీస్ ని క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా స్టాఫ్ కూడా క్వరంటైన్ లోకి పంపినట్లు సమాచారం. ఈ సంఘటనతో మిగతా నిర్మాతలంతా ఎలర్ట్ అయ్యారు. సినిమాలు లేనప్పుడు ఆఫీస్ లు తెరుచుకుని కూర్చోవటం ఎందుకు అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురి అయ్యినట్లైంది. 
 
ఇప్పటికే చాలా మంది నిర్మాతలు, దర్శకులు,హీరోలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారు సెల్ఫ్ లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ  వార్త టీ–టౌన్‌లో సంచలనంగా మారింది.  

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?