నేను ఆరోగ్యంగా ఉన్నా.. ఫేక్‌ న్యూస్‌పై గేయ రచయిత ఆవేదన

By Satish ReddyFirst Published Jul 9, 2020, 9:40 AM IST
Highlights

ఇటీవల  అశోక్‌ తేజకు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స జరిగింది. కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జ్‌ అయిన ఆయన ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అశోక్‌ తేజ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ ప్రచారం జరుగుతోంది.

సోషల్‌ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ భారీగా ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన తప్పుడు వార్తలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఫేక్‌ న్యూస్‌ కారణంగా ప్రముఖుల కుటుంబ సభ్యులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ ఆరోగ్య పరిస్థితిపై ఇలాంటి పుకార్లే ప్రచారమయ్యాయి.

ఇటీవల  అశోక్‌ తేజకు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స జరిగింది. కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జ్‌ అయిన ఆయన ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అశోక్‌ తేజ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ ప్రచారం జరుగుతోంది. దీని ఆధారంగా కొన్ని వెబ్‌సైట్లు కూడా అదే వార్తను ప్రచారం చేశాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో సుద్దాల అశోక్‌ తేజ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. `మీ అందరి ప్రేమ వల్ల, దయ వల్ల, ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తరవాత మెల్లమెల్లగా రోజురోజుకి నేను కోలుకుంటున్నాను. మళ్లీ పాటలు కూడా రాస్తున్నాను. నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. కాకపోతే, ఈ కరోనా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరి మాదిరిగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది తప్ప.. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అశోక్ తేజ ఆరోగ్యం మళ్లీ విషమంగా ఉందని వార్తల్లో వచ్చినట్టు తెలిసింది. వాటిలో నిజం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను` అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తల్లో నిజం లేదు: సుద్దాల అశోక్ తేజ pic.twitter.com/7alfk0PLPK

— Asianet News Telugu (@asianet_telugu)

ఎన్నో అద్భుతమైన పాటల సుద్దాల అశోక్ తేజ కలం నుంచి వచ్చాయి. ఠాగూర్ సినిమాలో ఆయన రాసిన నేను సైతం పాటకు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు అశోక్‌ తేజ. దాదాపు 2 వేలకు పైగా పాటలు రాసిన సుద్దాల అశోక్‌ తేజ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

click me!