అఫీషియల్ :ఓటిటి లోకి “యశోద”..డేట్ ఫిక్స్

Published : Dec 06, 2022, 01:24 PM IST
అఫీషియల్ :ఓటిటి  లోకి “యశోద”..డేట్ ఫిక్స్

సారాంశం

 తొలి రోజే పాజిటివ్ టాక్‌‌ని సొంతం చేసుకుని రూ.30 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది.  ఈ సినిమా కోసం ఓటీటీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. 


సమంత లీడ్ రోల్ పోషించిన యశోద చిత్రం భాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. హరి- హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 11న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. తొలి రోజే పాజిటివ్ టాక్‌‌ని సొంతం చేసుకుని రూ.30 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది.  ఈ సినిమా కోసం ఓటీటీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. యశోద మూవీ ఓటీటీ రైట్స్‌ని ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ భారీ ధరకి దక్కించుకుంది. 

 ఈ సినిమాపై రీసెంట్ గా ఇవా ఆసుపత్రి యాజమాన్యం పరువు నష్టం దావా వేసింది. సినిమాలో ‘ఈవా’ పేరుతో నడిచే సరోగసీ సెంటర్‌లో క్రైమ్ జరిగినట్లు చూపించారని.. అది తమ ఆసుపత్రి మనుగడని దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది. అలానే ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవకుండా ఆపేయాలని కూడా ఆ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. కానీ.. రోజుల వ్యవధిలోనే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ చొరవ తీసుకుని రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో రిలీజ్ చేయబోయే వెర్షన్‌లో ‘ఇవా’ పేరుని బ్లర్ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి మార్గం క్లియర్ అయ్యింది.  అమెజాన్ ప్రైమ్ వీడియో తన ప్లాట్‌ఫారమ్‌లో డిసెంబర్ 9, 2022న ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేస్తుంది. ఈ మేరకు ప్రకటన వచ్చింది

ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ లాభాలు వచ్చాయని సమాచారం. సరోగసీ నేపధ్యంలో క్రైమ్ ఎలిమెంట్ తో  తెరకెక్కిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ విలన్ గా నటించింది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. త్వరలో  సమంత యశోదతో చాలా మంది హృదయాలను గెలవనుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?