రివ్యూ : ‘జోహార్’

By Surya Prakash  |  First Published Aug 14, 2020, 12:49 PM IST

మనకు సామాజిక వ్యంగ్యాత్మక చిత్రాలు తక్కువే. అప్పట్లో కోడి రామకృష్ణ వంటి దర్శకులు రాజకీయంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు తీసుకుని వాటి చుట్టూ కథ అల్లి సామాన్యుడుకి సైతం డిల్లీ రాజకీయం అర్దమయ్యేలా చేసి,హిట్ కొట్టేవారు. భారత్ బంద్, జెండ్ వంటి అనేక చిత్రాలు అలా వచ్చినవే. అలాగే ఎంత పొలిటికల్ సెటైర్ అయినా అందులో తగు మాత్రం ఎంటర్ట్నైన్మెంట్ కలిపేవారు. దాంతో అవి అన్ని వర్గాలకు నచ్చేవి.  ఆ విథమైన సినిమాల వల్ల చూసేవారికి వైవిధ్యమూ దొరికేది. అయితే ఇప్పుడా ధైర్యం ఎవరూ చేయటం లేదు. చాలా కాలం తర్వాత విగ్రహ రాజకీయాలు చుట్టు ఓ కథ అల్లి తెరకెక్కిన సినిమా జోహార్. ఏ పార్టీని ఉద్దేశించి అనేది ప్రక్కన పెడితే రొటీన్ గా వస్తున్న సినిమాలకు విభిన్నమైన ఆలోచనే చెప్పాలి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది...కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి
రోడ్డుమీద సర్కస్ చేసే బాల (నైనా గంగూలి) తన కాళ్లకున్న సత్తువతో, తన ప్రతిభతో పరుగుపందెంలో దేశం కోసం గోల్డ్ మెడల్ గెలవాలనుకుంటే అమ్మాయి . తన బోస్ హాస్టల్ లో పిల్లలకి సరైన వసతి కల్పించాలని…. ప్రభుత్వం నిధులు కోసం తిరిగే ముసలి వ్యక్తి బోస్ (శుభలేఖ సుధాకర్). స్వతంత్ర్య పోరాటం నాటి విలువలను ఇంకా అంటిపట్టుకుని తన ఆశయం కోసం పోరాడుతూంటాడు.

Latest Videos

undefined

ఉద్దానం కిడ్నీ సమస్య తో భర్తను పోగొట్టుకొని…. తన కూతురిని కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్న తల్లి గంగమ్మ (ఈశ్వరీరావు). కొద్దిగా పొలాన్ని కౌలుకు తీసుకుని తన కూతురుకి వైద్యం చేయించాలని తిరుగుతూంటుంది.

వారణాసిలో ఉంటూ...చదువే జీవితం అనుకుని ప్రేమించిన టీ కొట్టు కుర్రాడితో  రాజమండ్రి పారిపోయిన వేశ్య కూతురు జ్యోతి (ఎస్తర్ అనిల్). మెడిసన్ చదువుకోసం స్కాలర్ షిప్ కు అప్లై చేసుకుంటుంది. వీళ్లందరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బాధపడుతూ ..ప్రభుత్వం నుంచే సాయం కోసం ఎదురుచూస్తూ బ్రతుతుకూంటారు. 

అదే సమయంలో తన తండ్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుతరామయ్య చనిపోవడంతో ఆ స్థానంలో కి వచ్చిన వారసుడు సీఎం విజయ్ వర్మ (చైతన్యకృష్ణ). విజయ్ వర్మకు ఓ ఆలోచన వస్తుంది.  తన పార్టీ పరువు, తన తండ్రి ఖ్యాతిని ప్రపంచమంతా తెలియజేయాలని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. అయితే అంత డబ్బు తమ దగ్గర లేదు. దాంతో సంక్షేమ పధకాలపై పెట్టిన డబ్బుని కొంత ప్రక్కకు మళ్లించి, విగ్రహం నిర్మాణానికి పూనుకుంటాడు.  ఈ నిర్ణయం వల్ల ఆ నలుగురి జీవితాలకు అందాల్సిన ప్రభుత్వం సాయం దెబ్బ పడుతుంది. దాంతో వారి జీవితాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం ఏమిటి...భారీ ఖర్చుతో నిర్మించే విగ్రహాల వల్ల  ప్రజలకు జరిగే నష్టం ఏమిటి? అన్నది తెలియాలంటే సినిమా 'ఆహా' ఓటీటీలో చూడాల్సిందే.

ఎలా ఉంది...
ఇది ఒక ఆంథాలజీ. ఒకేసారి పలు కథలను  కథలను తీసుకుని, వాటిని కలిపే ఓ థ్రెడ్ ని ఎంచుకుని ఓ కథగా మలచడమే ఆంథాలజీ. కొత్తగా వస్తున్న వెబ్ సీరిస్ లు, సినిమాలు ఈ తరహాలో ప్రెజెంట్ చేయటానికి ఈ తరం దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదీ అలాంటిదే. విగ్రహం అనే పాయింట్ ని లింక్ చేస్తూ మిగతా కథలన్ని ముడెట్టారు. అయితే ఆ విషయం మనకు అర్దమయ్యే సరికి సినిమా చాలా భాగం జరిగిపోతుంది. అలాగే ఈ కథలో కంక్లూజన్ ఉండదు. ఓ రాజకీయ నాయకుడు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సామాన్యులపై ఎలా పడుతుందో, జనం ఎలా ఇబ్బంది పడతారో చెప్పారు. ఓ డాక్యుమెంట్ లా తీర్చిదిద్దారు. విగ్రహ రాజకీయాల చుట్టూ కథ అల్లి సినిమా చేయటం గొప్ప విషయమే అయినా ఎక్కడా ఎంటర్టైన్మెంట్ అనేది కనపడదు. సినిమా అంతా సీరియస్ టోన్ లో నడుస్తుంది. అందరివి తట్టుకోలేని సమస్యలే. ఎక్కడా రిలీఫ్ ఇవ్వడు. అలాగే ఫస్టాఫ్ లో ఏం జరిగిందో..సెకండాఫ్ లోనూ అదే జరిగింది. దాంతో కొంత బోర్ కొడుతుంది. అలాగే ఎక్కడ కూడా ఊహించని ట్విస్ట్ లు ఉండి ఉత్సాహం తెప్పించవు. క్లైమాక్స్ కూడా పూర్తిగా ఎక్సపెక్ట్ చేసేదే. 

టెక్నికల్ గా 
ఈ సినిమాలో సీనియర్ నటులు శుభలేఖ శుధాకర్, ఈశ్వరీరావు వంటివారు ఉండటం ప్లస్ అయ్యింది. చైతన్య కృష్ణ ఫెరఫెక్ట్ యాప్ట్ గా యంగ్ పొలిటీషన్ గా కనిపించారు. నైనాగంగూలీ ఓకే. జగదీష్ చీకటి కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ సోసో గా సాగింది.  ఉన్నంతలో  డైలాగ్ రైటర్ రామకృష్ణ వంశీ గురించి చెప్పుకోవాలి. అతను ప్రతి సీన్ లోనూ ప్రతి పాత్రకు తగినట్లుగా ఎక్కడా అతిలేకుండా రాసారు. రీరికార్డింగ్ కూడా చాలా సీన్స్ కు  ప్రాణం పోసి.. కొంచెం ఎమోషనల్ గా ఉండే వారి గుండె బరువెక్కి…. కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.
 
ఫైనల్ థాట్
ఇంకా సుభాష్ చంద్రబోస్ తో కలిసి పనిచేసిన (1940) స్వతంత్ర సమర యోధులు ఉన్నారా.. పోనీ ఉన్నా.. ఓపిగ్గా..కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, ఆశ్రమం రన్ చేయటం ఏమిటి...వయస్సు ఆగిపోయిందా వాళ్లకు (శుభలేఖ శుధాకర్ ఆ పాత్ర వేసింది)

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5/5

click me!