టాలీవుడ్‌లో సంక్షోభం : ముగిసిన ఫిలిం ఛాంబర్ స్పెషల్ కమిటీ భేటీ, 30న మరోసారి సమావేశం

Siva Kodati |  
Published : Jul 27, 2022, 04:56 PM IST
టాలీవుడ్‌లో సంక్షోభం : ముగిసిన ఫిలిం ఛాంబర్ స్పెషల్ కమిటీ భేటీ, 30న మరోసారి సమావేశం

సారాంశం

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పెషల్ కమిటీ బుధవారం కీలక భేటీ నిర్వహించింది,

హైదరాబాద్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్ స్పెషల్ కమిటీ (telugu film chamber) సమావేశం ముగిసింది. ఈ నెల 30న మళ్లీ భేటీ కావాలని నిర్ణయించింది. సమావేశానికి హాజరైన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ఫెడరేషన్ సభ్యులు.. కాస్ట్ కటింగ్, ఓటీటీ , ఫెడరేషన్ సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ (tollywood) సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్చలు, సమస్యల పరిష్కారానికి పరిష్కారాల కనుగొనేవరకు వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. సినిమాల థియేటరిక్ వసూళ్లు తక్కువ స్థాయికి పడిపోవడం.. ప్రొడక్షన్ ఖర్చులు విపరీతంగా పెరిగడంతో.. పరిశ్రమను పునర్నిర్మించే ప్రయత్నంలో నిర్మాతల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

Also REad:Bandla Ganesh: రెమ్యునరేషన్ తో చుక్కలు చూపించిన బండ్ల గణేష్.. డైరెక్టర్ నోట మాట లేదు ?

అయితే సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలనే నిర్ణయం పలు అగ్ర హీరోల చిత్రాలపై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. షూటింగ్‌ల బంద్ నిర్ణయంపై అగ్ర హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో చర్చలు జరిపారు. అయితే వీరు ముగ్గురు కూడా రెమ్యూనరేషన్‌ తగ్గించుకోవడానికి ముందుకొచ్చినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో భాగంగా రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటామని ఆ హీరోలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, త్వరలోనే మిగతా హీరోలతో కూడా చర్చలు జరుపుతామని నిర్మాతలు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు