'నోటా'లో తెలంగాణా రాజకీయాలు..?

By Udayavani DhuliFirst Published Sep 26, 2018, 2:56 PM IST
Highlights

వెండితెరపై పొలిటికల్ డ్రామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతాయి. ప్రస్తుత రాజకీయాలని తెరపై సమర్ధవంతంగా చూపించగలిగితే.. సినిమా క్లిక్ అవ్వడం ఖాయం. విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా పోస్టర్లు, ట్రైలర్లను బట్టి సినిమా మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. 

అయితే తమిళ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందనే వార్తలు వినిపించాయి. దీంతో తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందనే సందేహాలు తలెత్తాయి. అయితే మేకర్స్ ఆలోచనలు మాత్రం మరో విధంగా ఉన్నాయి.

దక్షిణాది రాజకీయాల ముఖచిత్రాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారని టాక్. కేవలం తమిళ రాజకీయాలు మాత్రమే కాదు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని కూడా ఈ సినిమాలో చూపించారని సమాచారం. కేటీఆర్, కేసీఆర్ లను పోలిన పాత్రలతో పాటు జయలలిత ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో చూచాయిగా టచ్ చేశారని తెలుస్తోంది.

కేరళ రాజకేయాలని కూడా ఇందులో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అయితే వివాదాస్పదంగా కాకుండా.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సన్నివేశాలను నడిపించారని తెలుస్తోంది. మరి దక్షిణాది రాజకీయాల నడుమ సాగిన ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! 

click me!