తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు ఓపెన్‌.. కండీషన్స్ అప్లై !

By Aithagoni RajuFirst Published Nov 23, 2020, 5:40 PM IST
Highlights

సోమవారం సాయంత్రం సినిమా థియేటర్ల ఓపెనింగ్‌పై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఈ మేరకు జీవో విడుదల చేశారు. ఇమ్మిడియెట్‌గా ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎలక్షన్లు జరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై వరాల జల్లు కురిపిస్తుంది. చిత్ర పరిశ్రమకు చెందిన ఓట్లని క్యాష్‌ చేసుకునేందుకు ఏడేళ్లలో లేని విధంగా ఇప్పుడు చక చకా నిర్ణయాలు తీసుకుంటుంది. సినిమాలపైనే కాదు, థియేటర్ల అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

సోమవారం సాయంత్రం సినిమా థియేటర్ల ఓపెనింగ్‌పై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఈ మేరకు జీవో విడుదల చేశారు. ఇమ్మిడియెట్‌గా ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంటే ఈ లెక్కన రేపటి నుంచే థియేటర్లు ఓపెన్‌ కానున్నాయని చెప్పొచ్చు.  ఇందులో ప్రధానంగా యాభై శాతం సిట్టింగ్‌ కెపాసిటీతో థియేటర్లు ఓపెన్‌ చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి ఆడియెన్స్ కచ్చితంగా మాస్క్ ధరించాలని, థియేటర్‌లో ప్రతి ఒక్కరు శానిటైజర్‌ వాడేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. 

భౌతిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా తిరగడాన్ని నిషేధించింది. ప్రతి షో ముందుకు కామన్‌ ఏరియాలో శానిటైనేషన్‌ చేయాలని తెలిపింది. టెంపరేచర్‌ 24 నుంచి 30 డిగ్రీ సెల్సీయస్‌ మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, హ్యూమినీటిని 40 నుంచి 70 మధ్య మెయింటేన్‌ చేయాలని పేర్కొంది. 

రేపటి నుంచి తెలంగాణ లో సీనిమా థియేటర్లు ఓపెన్ pic.twitter.com/uzGioJZp3D

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఇక ఇప్పటికే సీఎం కేసీఆర్‌ పదికోట్ల లోపు బడ్జెట్‌ సినిమాలకు జీఎస్‌టీ రీఎంబర్స్ మెంట్ కల్పించారు. అలాగే షోలు పెంచుకునే వెసులుబాటు ఎగ్జిబిటర్లకే వదిలేశారు. టికెట్స్ రేట్స్ సైతం థియేటర్స్ యాజమాన్యం ఇష్టప్రకారం పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆరు నెలలు థియేటర్లలో కరెంట్‌ బిల్లు రద్దు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆదివారం సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు సీఎం కేసీఆర్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా వెంటనే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

click me!