కరణ్ జోహార్ ఇలాంటి వరస్ట్ పనా? స్టార్ డైరక్టర్ కంప్లైంట్

Surya Prakash   | Asianet News
Published : Nov 23, 2020, 05:02 PM IST
కరణ్ జోహార్ ఇలాంటి వరస్ట్ పనా? స్టార్ డైరక్టర్ కంప్లైంట్

సారాంశం

కరణ్‌, అపూర్వ మెహతాలపై ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్‌)కు కూడా ఫిర్యాదు చేశారు. మధూర్ బండార్కర్ కంప్లైంట్ ను పరిశీలించిన ఐఎమ్‌పీఆర్‌ కరణ్‌, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వా‍ల్సిందిగా ఆదేశించింది. 

సినీ పరిశ్రమలో కథలు ఎత్తేయడం ,కేసులు నడవటం చూస్తూంటాం. అదే విధంగా టైటిల్స్ కూడా అప్పుడప్పుడూ వివాదాల్లో ఇరుక్కూంటాయి. అయితే ఇందులో పెద్దవాళ్ల పేర్లు ఉన్నప్పుడే వార్తల్లోకు ఎక్కుతూంటాయి. తాజాగా కరుణ్ జోహార్ తన టైటిల్ ని లేపేస్తాడని, దాన్ని వదిలేయమంటూ ప్రముఖ దర్శకుడు మధూర్ బండార్కర్ వార్తల్లోకి రావటం అంతటా హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. తాజాగా దర్శకుడు మధుర్ భండార్కర్.. కరణ్‌ జోహార్ తన‌ టైటిల్‌ను వాడుకున్నారని ఐఎమ్‌పీఆర్‌కు కంప్లైంట్ చేశారు. అంతేగాక దీనిపై ఆయన శనివారం ట్వీట్‌ చేస్తూ.. ‘బాలీవుడ్‌ వైవ్స్’‌ అనే పేరుతో తను సినిమాను రూపొందిస్తున్నానని.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైందని చెప్పారు. అయితే ఈ టైటిల్‌ను కరణ్‌ తన వెబ్‌ సిరీస్‌కు వాడుకున్నారని ఆరోపించారు. 

ఆ ట్వీట్ లో ఏముందంటే...‘డియర్‌ కరణ్‌ జోహార్‌ మీరు, అపూర్వ మెహతా బాలీవుడ్‌ వైవ్స్‌ అనే నా సినిమా టైటిల్‌ మీ వెబ్ సిరీస్‌ కోసం అడిగారు. అయితే అప్పటికే నా సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడంతో మీకు ఆ టైటిల్‌ ఇచ్చేందుకు నిరాకరించాను. కానీ మీ వెబ్‌ సిరీస్‌కు ‘దిఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్ ‌బాలీవుడ్‌ వైవ్స్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అది నా సినిమా టైటిల్‌. దీనిని మీరు వాడుకోవడం అనైతికం. దయచేసి ఆ టైటిల్‌ను మర్చాలని మిమ్మల్ని వెడుకుంటున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌లో‌ పేర్కొన్నారు. 

అంతేగాక కరణ్‌, అపూర్వ మెహతాలపై ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్‌)కు కూడా ఫిర్యాదు చేశారు. మధూర్ బండార్కర్ కంప్లైంట్ ను పరిశీలించిన ఐఎమ్‌పీఆర్‌ కరణ్‌, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వా‍ల్సిందిగా ఆదేశించింది. అయితే ఇంతవరకు కరణ్‌, మెహతాలు దీనిపై స్పందించకపోవడం చెప్పుకోదగ్గ విషయం. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుల‌ భార్యల లైఫ్‌స్టైల్‌ను తెరపై చూపించే నేపథ్యంలో కరణ్‌ ‘ఫ్యాబులస్‌ లైఫ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 20: బల్లి అక్కకి మూడింది.. ప్రేమ, నర్మద ఫోకస్ మొత్తం వల్లిపైనే
Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్‌ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్‌.. పూజా టీమ్‌ చెప్పిన నిజం ఏంటంటే