
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమా సినిమాకు బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఇటీవల రొమాంటిక్ ఫిల్మ్ ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’తో మరోసారి అలరించనున్నాడు. ఇఫ్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. టీజర్ చాలా ప్రామీసింగ్ గా ఉంది.
విభిన్న పాత్రలతో అలరిస్తున్న కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ గా ఆకట్టుకుంటున్నాడు. చిత్రంతో ఓ శ్రీమంతుడి కూతురికి, క్యాబ్ డ్రైవర్ కు మధ్య సాగే కథే Neni Meeku Baga Kavaalsina vaadiniతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ బెస్ట్ పెర్పామెన్స్ కనిపిస్తోంది. ఇక హీరోయిన్ సంజనా ఆనంద్ (Sanjana Anand) గ్లామర్ ఒళకబోసింది. సంగీత బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బీజీఎం అందించారు. ఇక దర్శకుడు శ్రీధర్ గాదే బెస్ట్ ఫ్రేమింగ్ తో, ఇంట్రెస్టింగ్ బ్లాక్స్ తో తన మార్క్ చూపించబోతున్నాడని అర్థమవుతోంది.
మూవీలో కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్ శ్రీధర్ గాడే మరోసారి కిరణ్ తో కలిసి మ్యాజిక్ చేయనున్నాడు. కోడి రామక్రిష్ణ కూతురు కోడి దివ్య దీప్తి సినిమాను నిర్మిస్తున్నది. కోడీ దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ‘నేను మీకు బాగా తెలిసిన వాడిని’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్ నూ అనౌన్స్ చేయనున్నారు.