
బాలీవుడ్ డైరక్టర్ ...ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. డివైడ్ టాక్ వచ్చినా దానికి సంభందం లేకుండా బాక్సాఫీసు వద్ద సినిమా దూసుకెళ్తోంది. మెుదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు సైతం.. బాక్సాఫీసు దగ్గర చెప్పుకోదగిన వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం లో ని డైలాగ్స్ పై రకరకాల వివాదాలు వచ్చాయి. విమర్శలు వస్తున్నాయి.ముఖ్యంగా హనుమంతుడికి రాసిన డైలాగ్స్‌పై శివసేన ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్.. ప్రజాభిప్రాయాలను గౌరవిస్తూ ఆయా డైలాగ్స్ మార్పు కోసం (Dialogues Change) రంగంలోకి దిగింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేసింది. ఆ ప్రకటన సారాంశం ఇది.
‘ఆదిపురుష్’కు ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన లభిస్తోంది. ఈ మూవీ అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ విజువల్ వండర్‌ను మెమొరబుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేందుకు.. ప్రజలు, ప్రేక్షకుల ఇన్‌పుట్స్‌కు విలువనిస్తూ డైలాగ్స్‌లో మార్పులు చేయాలని టీమ్ నిర్ణయించుకుంది. సినిమాలోని డైలాగ్స్‌ను మేకర్స్ మరోసారి పరిశీలిస్తున్నారు. సినిమాకు సంబంధించి మెయిన్ ఎస్సెన్స్ ప్రతిధ్వనించేలా చేసే మార్పులు కొన్ని రోజుల్లో థియేటర్లలో ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్లు ఉన్నప్పటికీ టీమ్ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఎందుకంటే ప్రేక్షకుల మనోభావాలు, సామరస్యానికి మించినది ఏమీ లేదు’ అనే ప్రకటన రిలీజ్ చేశారు.
ఆదిపురుష్ మేకర్స్ శనివారం మధ్యాహ్నం బాక్సాఫీస్ గణాంకాలను ట్వీట్ చేశారు. 'ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. మొదటి రోజున రూ.140 CR బంపర్ ఓపెనింగ్‌తో అంచనాలను అధిగమించింది. 2వ రోజున రూ.100 కోట్లతో కేవలం రెండు రోజుల్లోనే మొత్తం కలెక్షన్‌ను రూ.240 CRకి తీసుకువెళ్లింది. జై శ్రీ రామ్' అని టి సిరీస్ ట్వీట్ చేసింది. టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రూ. 500 కోట్లు ఖర్చుపెట్టారు. 400 కోట్లకు పైగా ప్రిరీలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ప్రస్తుత కలెక్షన్స్ చూస్తుంటే మొదటివారంలోనే బడ్జెట్ మొత్తం రికవరీ చేసే అవకాశాలున్నాయి.