
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న `పుష్ప2` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. `పుష్ప` మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్ ని నెక్ట్స్ లెవల్‌లో డిజైన్ చేస్తున్నారట. ఇందులో కొన్ని ఎపిసోడ్లని ఊహించని విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినిమా మొత్తంలో నాలుగైదు గూస్‌బంమ్స్ తెప్పించే సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు పెట్టబోతున్నారట. వాటిపై సుకుమార్ ప్రత్యేక దృష్టిపెట్టినట్టు సమాచారం.
అందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని సుకుమార్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందట. అంతేకాదు ఇంటర్వెల్‌లో ఆడియెన్స్ ని హైలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సమాచారం. అందుకోసం స్వర్ణముఖి నదిపై అల్లు అర్జున్, విలన్ల మధ్య ఓ ఛేజింగ్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఇక్కడ బన్నీ పాత్ర(కొత్త లుక్‌కి సంబంధించి)ని పరిచయం చేస్తూ వచ్చే ఈ ఇంటర్వెల్ సీన్ ఆడియెన్స్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చేదిగా ఉంటుందట.
ప్రస్తుతం దీన్ని చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. `పుష్ప2`లో కొత్త పాత్రలు వస్తాయనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖమైన నటులు ఈ రెండో భాగంలో కనిపిస్తారని, ఆయా పాత్రలు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని టాక్. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
`పుష్ప` మొదటి భాగం మిశ్రమ స్పందన రాబట్టుకున్నప్పటికీ మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. దీంతో రెండో పార్ట్ ని ఆరేడు వందల కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో రూపొందిస్తున్నారు. బడ్జెట్ పెంచారు, ఆ భారీ తనాన్ని పెంచారు సుకుమార్. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నటిస్తుండగా, శ్రీవల్లిగా రష్మిక మందన్నా నటిస్తుంది. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.