'టాక్సీవాలా' ట్విట్టర్ రివ్యూ!

Published : Nov 17, 2018, 09:28 AM IST
'టాక్సీవాలా' ట్విట్టర్ రివ్యూ!

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ సంక్రిత్యాన్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ సంక్రిత్యాన్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా గురించి నెటిజన్లు ఏం అనుకుంటున్నారో.. ట్విట్టర్ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

హైఫై సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా కొత్త ప్రయోగంతో ఈ సినిమా డీసెంట్ గా ఉందని.. ఒకసారి సినిమా చూడొచ్చని అంటున్నారు. ఈ సినిమా మొదటి నుండి ఎండ్ టైటిల్స్ పడే వరకు ఎంజాయ్ చేయోచ్చని.. ప్రతి ఫ్రేమ్ థ్రిల్ చేసిందని అంటున్నారు.

విజయ్ వీరాభిమానులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంటే రెగ్యులర్ సినిమా ఆడియన్స్ మాత్రం ఈ సినిమా బోరింగ్ అంటూ పెదవి విరుస్తున్నారు. బిలో ఏవరేజ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టోరీలో లాజిక్ లేదని అనవసరంగా సినిమాను హైప్ చేస్తున్నారంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?