ప్రీమియర్ షో టాక్: విజయ్ టాక్సీ వాలా

By Prashanth MFirst Published 17, Nov 2018, 7:28 AM IST
Highlights

అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాలతో బాక్స్ ఆఫీస్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సక్సెస్ ట్రక్ ను ఎట్టి పరిస్థితులో మిస్ కావద్దని టాక్సీ వాలాతో వస్తున్నాడు.

 

హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే యూఎస్ లో ముందే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఇప్పుడు ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం..

ఖాళీగా ఉండకుండా ఏదైనా జాబ్ చేయాలని శివ(విజయ్) తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరికి ఒక పాతకాలం కారును కొనుగోలు చేసి క్యాబ్ డ్రైవర్ గా మరతాడు. అందుకు అతని అన్నా వదినలు సహాయపడతారు. ఇక ఒక అమ్మాయి ప్రేమలో పడ్డ శివ   ఆ తరువాత క్యాబ్ వల్ల ఊహించని పరిణామాలను ఎదుర్కొంటాడు. అతని క్యాబ్ లో ఎదో తెలియని దెయ్యం ఉందని గ్రహిస్తాడు.

అదే విషయాన్ని ఫ్రెండ్స్ కి చెబుతుంటాడు. అదే విధంగా ఆ క్యాబ్ విజయ్ ని విడిచిపెట్టదు. ఒకరోజు ఒక వ్యక్తిని చంపేయడంతో ఊహించని విదంగా కథ మలుపు తీరుగుతుంది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఆ తరువాత విజయ్ క్యాబ్ తో ఎలా ట్రావెల్ అయ్యాడు చేసుకున్న ఒప్పందం ఏంటి అనే అంశాలు తెరపై ఆకట్టుకున్నాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో సో సో గానే ఉన్నాయి.

ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు అవసరమా అనిపిస్తాయి. అయితే విజయ్ మార్క్ కామెడీ సన్నివేశాలు సినిమాలో మెయిన్ హైలెట్. లవ్ సీన్స్ పరవాలేదు. అయితే ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ కోసం కష్టపడ్డ చిత్ర యూనిట్ ఆ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెమెరా పనితనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావున్నాయి. ఇక ఫైనల్ గా విజయ్ ఫ్యాన్స్ సినిమాను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

Last Updated 17, Nov 2018, 7:39 AM IST