దొరికిపోయా.. ట్రోల్ చేస్తున్నారు.. 'టాక్సీవాలా' బ్యూటీ కామెంట్స్!

Published : Dec 01, 2018, 12:43 PM IST
దొరికిపోయా.. ట్రోల్ చేస్తున్నారు.. 'టాక్సీవాలా' బ్యూటీ కామెంట్స్!

సారాంశం

మరాఠీ ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ అనంతపూర్ లోనే పెరిగింది. దీంతో ఆమె తెలుగు చక్కగా మాట్లాడగలదు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 

మరాఠీ ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ అనంతపూర్ లోనే పెరిగింది. దీంతో ఆమె తెలుగు చక్కగా మాట్లాడగలదు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ప్రియాంకకి మంచి గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రియాంకకి సంబంధించిన పాట ఫోటో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి ఫోటో అది. ఆ ఫోటోలో ఆమె బొద్దుగా కనిపించడం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

వెయిట్ లాస్ క్లినిక్ కి ప్రియాంక చక్కటి ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం ఫోటోని మార్ఫ్ చేశారని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపై స్పందించింది ప్రియాంక. ''అవును.. ఆ ఫోటోలో ఉన్నది నేనే.. దొరకకూడదని అనుకున్నా.. దొరికిపోయా. ఇప్పుడు సోషల్ మీడియా పేజెస్ లో నన్ను బాగా ట్రోల్ చేస్తున్నారు.

అవును చబ్బీగా ఉన్నదాన్ని ఇప్పుడు ఫిట్ గా మారాను. అందులో తప్పేముంది. ప్రతి ఒక్కరూ ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటారు. దీనికోసం నన్ను ట్రోల్ చేయాలనుకుంటే చేయండి.. నటిగా ఇవన్నీ నేను భరించాలి'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్