స్పెయిన్ లో విల్లా కొంటున్న ఎన్టీఆర్..?

Published : Dec 01, 2018, 12:24 PM IST
స్పెయిన్ లో విల్లా కొంటున్న ఎన్టీఆర్..?

సారాంశం

టాలీవుడ్ సెలబ్రిటీలు షూటింగ్ కోసం, ట్రిప్ ల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన స్పెయిన్ లో ఓ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 

టాలీవుడ్ సెలబ్రిటీలు షూటింగ్ కోసం, ట్రిప్ ల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన స్పెయిన్ లో ఓ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఓ విల్లా కొనాలని చూస్తున్నాడట.

దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన లేనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ విల్లాకి సంబంధించిన డీల్ కూడా ఫైనల్ చేశాడని టాక్. గతంలో ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా షూటింగ్ కూడా స్పెయిన్ లో నిర్వహించారు.

ఇప్పుడు అక్కడే ఓ విల్లా తీసుకోబోతున్నాడట తారక్. తన కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడానికి సొంతగా అక్కడ విల్లా తీసుకోవాలని భావిస్తున్నారట. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి కొంటున్నట్లు తెలుస్తోంది.

దీనికోసం 1.5 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టబోతున్నారట. అయితే తారక్ కొంటున్నది విల్లా కాదని అపార్ట్ మెంట్ అని కొందరు అంటున్నారు. స్పెయిన్ లో ప్రభుత్వం విదేశీయులను తమ ప్రాంతంలో ప్రాపర్టీస్ కొనమని ఎంకరేజ్ చేస్తుంటుంది. కమర్షియల్ అయినా, రెసిడెన్షియల్ అయినా ఎలాంటి సమస్య ఉండదు.   

PREV
click me!

Recommended Stories

Rajinikanth: రజనీకాంత్ ఆస్తి ఆయన కుటుంబ సభ్యులకు చెందదా, మొత్తం ప్రజలకే.. నిజంగా సూపర్ స్టార్ అలా చెప్పారా ?
Rajamouli: రాజమౌళి విజన్ ని మ్యాచ్ చేయగలిగే డైరెక్టర్ ఉన్నారా ? నిర్మాత ముఖం మీదే సమాధానం చెప్పిన జక్కన్న