తరుణ్ భాస్కర్ కొంత గ్యాప్‌తో ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ని నేడు విడుదల చేశారు.
తరుణ్ భాస్కర్ `పెళ్లి చూపులు` చిత్రంతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. టాలీవుడ్‌లో ప్రామిసింగ్ డైరెక్టర్‌గా మారారు. ఆ తర్వాత `ఈ నగరానికి ఏమైంది` చిత్రంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా స్ట్రయిట్ రిలీజ్ టైమ్‌లో కంటే రీ రిలీజ్ టైమ్‌లోనే బాగా ఆడటం విశేషం. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు.
`కీడా కోలా`ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా సాగుతుంది. ఓ షోకేస్ బొమ్మ చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతుంది. ఇందులో పొలిటికల్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా ఉంది. వీటి చుట్టూ చోటు చేసుకునే సన్నివేశాలతో ఫన్ ప్రధానంగా ఈ `కీడా కోలా` ట్రైలర్ సాగుతుంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంటుంది. మొదటగా నటుడు చైతన్య టురెట్టో సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టుగా బ్యాక్ గ్రౌండ్‌లో తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది.
తుమ్మొచ్చినప్పుడు మాట్లాడితే మధ్యలో ఇలాంటి సౌండ్లు వస్తాయని చెప్పగా, చైతన్య తుమ్ముతుండగా, చెప్ప దెబ్బకొట్టడం, ఆ తర్వాత కోర్ట్ లో వీడు నా ఫ్రెండ్ మేడమ్, చిన్నప్పట్నుంచి వీడు దరిద్రాన్ని డ్రాయర్‌లో వేసుకుని తిరుగుతున్నాడని లాయర్ చెప్పగా, మరో లాయర్ అబ్జెక్షన్ చెబుతాడు, దీనికి ఎందుకు డ్రాయర్లు వేసుకోవడమా? అని ఫ్రెండ్ లాయర్ స్పందించడం నవ్వులు పూయిస్తుంది. కోటీ రూపాయలు విలువ చేసే బొమ్మని వంద రూపాయలకు కూడా పనికి రాకుండా చేశాడని లాయర్ చెప్పగా, చైనా పీస్ బొమ్మకి కోటీ రూపాయలు కావాలంటే ఎట్టయితది మేడం అని చైతన్య తరఫు లాయర్ చెప్పడం ఫన్నీగా ఉంది.
అలాగే సెకండ్ హ్యాండ్ బట్టర్, వైన్ షాప్ వద్ద పకోడి తినడం, సెకండ్ హ్యాండ్ ల్యాప్ ట్యాప్‌లు తీసుకోవడం సీన్లలో, మన దగ్గర పైసలెప్పుడు ఉండేరా సేవ్ చేయనికి అని చెప్పడం, బాటిల్‌లో ఏదో ఉందిరా అనగా, బాటిల్‌లో కోట్లు కోట్లు కొట్టే లాటరీ టికెట్ రా అని చెప్పడం ఆకట్టుకుంది. అట్నుంచి పొలిటికల్ టచ్ తీసుకుంది. ఇందులో జీవన్ అన్నకి కార్పోరేట్ అవమానించడం, ఆ అవమానాన్ని నాయుడన్నతో చెప్పాలనుకోవడం, ఆ తర్వాత నాయుడిగా తరుణ్ భాస్కర్ జైలు నుంచి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత వరుసగా మాఫియా దిగడం, కాల్పులు, ఫైటింగ్‌లు, ఛేజింగ్‌లు ఇలా ఆద్యంతం రైడ్‌లా సాగింది. ట్రైలర్ నవ్వులు పూయించేలా ఉంది. తరుణ్ భాస్కర్ గత మూవీ `ఈ నగరానికి ఏమైంది` స్టయిల్‌లో ఇది కూడా పూర్తి ఫన్ మూవీ అని తెలుస్తుంది.
ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, చైతన్య, రవీంద్ర, `టాక్సీవాలా` విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వీజీ సైన్మా పతాకంపై కే వివేక్ సుధాన్ష్, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మిస్తున్నారు. ఈచిత్రం నవంబర్ 3న విడుదల కాబోతుంది.