అయ్యప్పమాలలో డిజే టిల్లు, వైరల్ అవుతున్న సిద్దు జొన్నలగడ్డ న్యూ లుక్స్..

By Mahesh Jujjuri  |  First Published Oct 18, 2023, 2:48 PM IST

టాలీవుడ్ లో డిఫరెట్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు సిద్దు జొన్నల గడ్డ. మాస్ హీరోగా ఎదగాలని ట్రై చేస్తున్న సిద్దు.. మాస్ పర్ఫామెన్స్ కు ఎంతో మంది ఫ్యాన్స ఉన్నారు. ఇక ఈమాస్ హీరో తాజాగా కొత్త అవతారం ఎత్తాడు.
 



టాలీవుడ్ లో డిఫరెట్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు సిద్దు జొన్నల గడ్డ. మాస్ హీరోగా ఎదగాలని ట్రై చేస్తున్న సిద్దు.. మాస్ పర్ఫామెన్స్ కు ఎంతో మంది ఫ్యాన్స ఉన్నారు. ఇక ఈమాస్ హీరో తాజాగా కొత్త అవతారం ఎత్తాడు.

గుంటూరు టాకీస్ తో అందరిని ఆకట్టుకుని.. డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు  సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)ఇక ఈ మాస్ హీరో పెర్ఫామెన్స్ కు ఫిదా అయిన వారెందరో.. ఆయనకు ఫ్యాన్స్ గామారారు. ఇక తనకు లైఫ్ ఇచ్చిన డిజే టిల్లుకి  సీక్వెల్ సినిమా టిల్లు స్క్వేర్ తో రాబోతున్నాడు సిద్దు. ఆసినిమా షూటింగ్ జరుగుతుండగానే.. కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు సిద్దు. 

Latest Videos

ఇటీవల ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో మరో కొత్త సినిమా అనౌన్స్ చేసాడు సిద్ధు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా(Raashii Khanna) హీరోయిన్స్ గా  ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈసినిమాకు తెలుసు కదా(Telusu Kada) అనే ఆసక్తికర టైటిల్ ను ప్రకటించారు. తాజాగా ఈమూవీ ఓపెనింగ్ జరగ్గా.. నేచురల్ స్టార్ నాని ఈమూవీని క్లాప్ కొట్టి ఓపెనింగ్ చేశారు. 

 

Unveiling moments from the grand opening of today!

🎬 First Clap by the Natural Star
🎥 Camera Switch On by
🎬 1st Shot Directed by
📜 Script handover by &

Film being Directed by &… pic.twitter.com/setsubQcei

— People Media Factory (@peoplemediafcy)

ఇక ఈ ఓపెనింగ్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు సిద్దు. ఈ మధ్య యంగ్ హీరోలంతా ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. ఈక్రమంలోనే సిద్దు కూడా మాలలో కనిపించారు.  తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ ఇలా తన కొత్త సినిమా ఓపెనింగ్ లో అయ్యప్ప మాలలో కనిపించగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇటీవల హీరో విశ్వక్సేన్ అంజనేయ స్వామి మాలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా బయట ఫుల్ స్పీడ్ గా ఉండే హీరోల్లో ఇలాంటి భక్తి భావం కూడా ఉందా అని ఆశ్చర్యపోతూనే అభినందిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ప్రస్తుతం సిద్దు న్యూల్ లుక్ ఫోటోస్ వైరల్అవుతున్నాయి. 


 

click me!