తండ్రితో చివరి జ్ఞాపకాన్ని పంచుకున్న తారకరత్న కూతురు, వైరల్ అవుతున్న వీడియో

Published : Mar 24, 2023, 02:29 PM ISTUpdated : Mar 24, 2023, 08:39 PM IST
తండ్రితో చివరి జ్ఞాపకాన్ని పంచుకున్న తారకరత్న కూతురు, వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

తారకరత్న మరణం నుంచి నందమూరి కుటుంబ ఇంకా కోలుకోలేకపోతోంది. నందమూరి హీరో జ్ఞపకాలతో తేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న కూతురు నిష్కా.. తండ్రి  జ్ఞాపకాలతో కూడిన పోస్ట్ లతో..సోషల్ మీడియాను నింపేస్తుంది.   


గుండెపోటుతో రీసెంట్ గా తారకరత్న మరణించిన విషయం తెలిసిందే.. చాలా రోజులు హాస్పిటల్ లో ఇబ్బందిపడ్డర నందమూరి హీరో.. తుది శ్వాస విడివడంతో.. అంతా షాక్ లోకి వెళ్లిపోయారు.  ఆయన మరణం ముఖ్యంగా నందమూరి కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. కోలుకోలేకుండా చేసింది.  ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, పిల్లలను ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. ఈక్రమంలో తన తండ్రి దూరం అవ్వడంతో తారకరత్న పెద్ద కూతురు నిష్కా.. ఆయన జ్ఞాపకాలనుంచి బయటపడలేకపోతోంది.  కుటుంబ సభ్యులు అయితే ఆ బాధ నుంచి బయటకి రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న భార్య , కూతురు నిష్కా.. సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తూ వస్తున్నారు. 

ఇక తాజాగా తారకరత్న కూతురు  నిష్కా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తారకరత్నకు సంబంధించిన చివరి  జ్ఞాపకాన్ని పంచుకుంది. తన తండ్రితో కలిసిసరదాగా గడిపిన వీడియోని షేర్ చేసింది.ఈ  వీడియోలో  తారకరత్న తన కూతురు  నిష్కాతో కలిసి ఆడుకుంటున్నారు. ఓక గేమింగ్ సెంటర్ కు వెళ్ళిన వారు  గేమ్ ఆడుతూ కనిపిస్తున్నాడు. అయితే ఇది ఎప్పటి వీడియోనో కాదు.. తారకరత్నకు గుండెపోటు వచ్చే ముందు రోజుదే అంటున్నారు టీమ్. అంతే కాదు ఈ పోస్ట్ లో ఈ విషయాన్ని నిష్కా రాసుకొచ్చింది. ముందురోజు సాయంత్రం తనతో కలిసి గేమ్ ఆడాడు అంటూ ఈ వీడియోని నిష్కా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 

 

ఇక తారకరత్న కార్యక్రమాలు అయిపోయిన తరువాత కాస్త గ్యాప్ తీసుకుంది తారకరత్నభార్య  అలేఖ్యరెడ్డి. వెంటనే.. తన ఇన్‌స్టాలో..సంచలన వ్యాఖ్యలు చేశారు.  సొంత వాళ్ళే తారకరత్న మనసు బాధపెట్టారు అంటూ  పోస్ట్ పెట్టింది. తారకరత్న ఎప్పుడు పెద్ద కుటుంబాన్ని కోరుకునేవాడు. కానీ తన ఆవేదనని కుటుంబంలోని ఎవరు అర్ధం చేసుకోలేదు అంటూ బాధపడింది.ఆఖరికి నేను కూడా తనని ఆ బాధ నుంచి బయటికి తీసుకు రాలేకపోయాను. సొంత వాళ్ళే తన మనసు బాధ పెట్టారు అంటూ సంచలనం చేసింది. 

ఇక మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది అలేఖ్య రెడ్డి. . మొదటి నుంచి మాతో ఎవరు ఉన్నారో, చివరిలో కూడా వాళ్ళే మిగిలారు. మేము ఎవర్ని అయితే కోల్పోయామో, వాళ్ళు తన చివరి చూపుకు కూడా రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలోప్రస్తుతుం  వైరల్ అవుతుంది. ఇక తారకరత్నంపై అభిమానంతో బాలయ్య బాబు.. తాను హిందూపురంలో కడుతున్న ఆస్పిటల్ లో ఓ బ్లాక్ కు.. తారకరతన్న పరు పెట్టబోతున్నట్టు ప్రకటించారు.  ఆ హాస్పిటల్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఉచితంగా వైధ్యం చేస్తామన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?